పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాములను ధరించుటెంత పాపమో శివశివా
ఏమయా సాంబ శివశివా
వెర్రివాడవైన కావు వెండికొండకు దొరవునీవు
పుర్రెలో భుజించుటెంత పుణ్యమో శివశివా
ఏమయా సాంబ శివశివా
ఎల్లవేల్పులకును నీవు ఆదిమూలమైనవేల్పు
బిచ్చమెత్తుకొనుటనుటేంత కర్మమోశివశివా
ఏమయా సాంబశివశివా'.

స్త్రీలపాటలలో శ్రీరాముని ఉంగరంచూసిన సీతభావనతో కూర్చినపాట-
"ఉంగరమా ముద్దుటుంగరమా
  నడువా కాళ్ళూలేవు ఎగురూ రెక్కలులేవు
  ఏలాగూవచ్చితివే ఉంగరమా" అనేది కరుణ రసాత్మకమై కన్నీరు తెప్పిస్తుంది.
బియ్యం ఏరుకుంటూనో, వత్తులు చేసుకుంటూనో గృహిణులు భారత భాగవత రామాయణ ఘట్టాలను పాటలుగా పాడుతుంటారు. అందులో కృషలీలలు--

"కస్తూరి రంగరంగా నాయన్న
కావేటి రంగరంగా
శ్రీరంగ రంగరంగా
నినుబాసి ఏటులునే మరచుందురా
కంసుణ్ణి సంహరింప
కృష్ణావతారుడై జన్మించెను
ఎదుగాళ్ళనుపుట్టెను ఆ బాలు
డేడుగురు దాదులను చంపెనపుడు-

"వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ
వైకుంఠ వసుడమ్మా
నవనీత చొరుడమ్మా ఈ బిడ్డ
నందగోపాలు డమ్మా"

అని స్థాయిగా పాడుతుంటే ఆ పాటల గమనానికీ, వస్తు విశేషానికీ అందరూ రాగరంజితులు కావలసిందే. అలాగే