పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/182

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని మగపెళ్ళివారివలె ఒకరిభుజాలమీద ఒకరు చేతులువేసి జట్టుకట్టుకుని, రెండ్వజట్టువారివద్దకువెళ్ళి ప్రశ్నించి వెనక్కి వెళతారు. అప్పుడు రెండవజట్టువారు ఆడపెళ్ళివారివలె మొదటిజట్టు దగ్గరకు వెళ్ళీ

"చిన్నీ చిన్నికి ఒకటోనెల సింగలగోరికి ఓకటోనెల
 తాడీబీడికి ఓకటోనెల తామరగిరిమొగ్గాలమ్మా మొగ్గలు"

అనిపాడుతూ జవాబుచెప్పుతారు. ఇలాగ అమ్మాయికి '16 ఏళ్ళు వచ్చేవరకూ పాడి, పెళ్ళి నిశ్చయంచేసి బొమ్మలపెళ్ళిళ్ళు చేస్తారు. అట్లతద్దినాడు వేకువజామున పిల్లలు జట్లుజట్లుగా తిరుగుతూ--

"అటతద్దోయ్ ఆరట్లోయ్
  ముద్ధపప్పోయ్ మూడట్లోయ్"
అంటూ ఊరంతటిని నిద్రలెపుతారు మేలుకొలుపు పాటగా--

  • "మహావిపత్తులకు ప్రజలు బలిఅయ్యారు కాని, ఎవ్ఫరూ

పిల్లల దేశీయ క్రీడల్ని, గీతాలను నాశనం చెయ్యలేక
పోయారు" అంటారు దేవేంద్ర సత్యార్ధిగారు.

                       పె ళ్ళి పా ట లు

పెళ్ళీళ్ళలో వధూవరులను పానుపుమీదకూర్చోబెట్తి ముత్తయుదువులు పాడే పెళ్ళీపాటలు ప్రతివారిహృదయాల్లోనూ పన్నీటిజల్లులు చిలకరింప చేస్తాయి. అందులో --
   "పన్నేండూ స్తంభాలా పందీటీలోనా
    లచ్చన్నా దరిగోళ్ళా పట్టీమంచాలు" అనే పెళ్ళీపాట -
    "ఏలాగు భోంచేతుము
      ఈ విందు మేము
     ఏలాగు భోంచేతుము" అనిభోజనంలోవడ్దించిన వంటకాలను అవహేళనచేస్తూ వియ్యాలవారిమీద పాట-


  • దేవేంద్ర సత్యార్ధిగారి మోడల్ రెవ్యూ సం 60 పు 334 (తెలుగు అనువాదం- ఆంధ్రుల జానపదవిజ్ఞానం పు 67 నుండి గ్రహింపబడినది)