పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పొందుతూసాగివస్తోంది. అందుకే భాషపుట్టినప్పుడే ఈ సాహిత్యం పుట్టిఉంటుందని భావించవచ్చు. 8వ శరాబ్ది విప్పర్రుశాసనాన్ని బట్టిమన తెలుగు భాషనన్నయకుముందేఉందనేదినివివాదం. ఇది పాటలు, మాటలు, లిట్లు, ఒట్లు, కధలు, సామెతలు మొదలైన దేశిరూపాలలో ఎక్కువగా కనిపిస్తుంది. పగటివేషాలు, తోలుబొమ్మలాటలవంటి కళారూపాలలోఉన్ంది కూడా ఈ జానపదసాహిత్యమే. *మన జానపద వాజ్మయంలో కావలసినంత కవిత్వంతోపాటు ఘనమైనగంభీరత్వం, ప్రాచీనసమీచీనవిజ్ఞాన సంస్కృతులు, సమయ సంప్రదాయాలు, వినోద చమత్కారాలు బోలెడున్నాయి. తెలుగు పలుకుబడితరబడి నుడిగారమునిగారముల నిండుకుండ ఆ వాజ్మయము. అంతేకాదు ఆ వాజ్మయములోని సరస సంగీత రీతుల్లో అనాహిత ప్రకృతి గానమాధురీధురీణముల్, గిరిఝురీ పరీవాహస్వరసంహితలు వినిపిస్తాయి. గీర్వ్చాణవాణీదరహాసము మీసందీర్బంగా, గీర్వాణంలోకులికే గాధ ప్రతిభులైన ప్రౌఢపండితకవులకు సైతం సునిశిత భావనా సాధ్యములైన రసమార్గాలను సుశువుగా భావించి, సుగమంగా పయనిస్తారు తెనుగుమీరిన జానపదకవులు. సంగీత సాహిత్య ఉభ కళాసురభిళము; అచ్చమైన సరస్వతీ ప్రసాదమీ వాజ్మయము. ఇలాంటి, ఇంతలాంటి ఈ మహావాజ్మయం తరతరాల శిష్టాచారపు నుడిచాపుల పిడికుచ్చెళ్ళు పొసుకుని, ముడిచి బిగించుకున్న పండితుల నిరాదరణకు గురి అవుతునే పురివిడుతునే ఊపిరి నిలుపుకుంటూ వచ్చింది."

                              గే యా లు

ఇప్పటివరకూ మనకులభ్యమౌతున్న దాన్నిబట్టి ఈ వాజ్మయంలో గేయ రచనే ఎక్కువ. పాటలోనోటనిలిచిపోయే గుణసుందరికనుక అదే అనాదినుండీ అనంతం గా పల్లపదుచుల గళాలలోనూ, శ్రామికజనుల జిహ్వాగ్రాలలోనూ, ముసలమ్మల బోసినోళ్ళలోనూ సజీవస్రవంతిగ సాగివస్తున్నది. లాలిపాటలు, జోలపాటలు, పెళ్ళిపాటలు, శోభనం పాటలు, చందమామ


  • జాతీయాచార్య డా. యస్. వి. జొగారావుగారు

(నేదునూరి గంగాధరంగారి జానపదగేయసాహిత్య వ్యాసావళి పీఠిక పుట3