పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/172

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాటలు, దంపుళ్ల పాటలు, పిల్లల పాటలు, కోలాటం పాటలు, శ్రామిక గీతాలు, వెన్నెల పదాలు, తుమ్మెద పదాలు ఇలా ఎన్నో రకాలు, పాల్కురికి సోమనాధుడు ఈ క్రించి దేశిగీతాలు ఉటంకించాడు.

"పదములు తుమ్మెద పరములో ప్రభాత
 పదములు..................వ్రాయిచే
 పదములు వెన్నెల పదములు

దీనినిబట్టి జానపదగేయప్రాచీనత పాల్కురికి ముందు ఏనాటిదో! ఈ గేయములపై మొదటగా పరిశోధన చేసిన మార్గదర్శకులు డాక్టర్. బిరుదు రామరాజుగారు.

  • "పల్లెసీమలలో ఊడ్పులుమొదలు, నూర్పులవరకూగల పొలముపనులన్నింటియందును పాటలు ప్రధానస్థానమాక్రమిచుచున్నవి. పిండివిసిరినప్పుడునూ ధాన్యమును దంపు సమయములోనూకపిలెతోలునప్పుడూ కలుపుతీయు వేళలందునూ కంకులుకోయు కాలముననూ కళ్ళములలో పనిచేయు సందర్భముననూ పొలము పుట్రల పొంత, చెట్టుచేమల చెంత సమిష్ఠిగాచేయు కృత్య సామస్త్యమునందునూ వ్యష్టిగాచేయుపనులలోనూ పాటలకు గల ప్రాచుర్యమత్యధికము. ఉల్లాసమునకు, ఉత్సాహమునకు పని సులువుగా, చురుకుగా సాగివచ్చుటకు ఇవి యావశ్యకములు"

                                        
                               జో ల పా ట లు
                'జో అచ్యుతానంద జొజొ ముకుందా
                 లాలి పరమానంద రామ గోవిందా
                          జో....జో....."
అని జోకొట్టి నిద్రపుచ్చుతుంది తన గారాలపట్టిని తల్లి.
                      'చందమామరావే జాబిల్లిరావే
                       కొండెక్కిరావే కోటివేలుతేవే
                       బండిమీదరావే బంతిపూలుతేవే
                       అన్నిటినీ తేవే అబ్బాయికివ్వవే '


  • జానపద కళా సంపద పుట - 5 ఆచార్య తూమాటి దోనప్ప