పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

135

జానపద వాజ్మయము

T " జానపద వాజ్మయం మాడ్చేఎండలు, కురిసేవర్షాలు, వొణికించే చలి, పంటపొలాలు, పెళ్ళిళ్లు, పేరంటారు, పండుగలు, పబ్బాలు, పూజలు, వినోదాలు ప్రతీసంఘటనా, ప్రతీసన్నివేశం పురస్కరించుకొని జానపద ఆబాలగోపాలం కవితావేశానికి కల్పించిన రూపకల్పనే వాజ్మయం. అందువల్ల దీనిలో జాతీయభావములు, జానుతెనుగు, తేనెసోనలూరే పదభావసన్నివేశములు వెల్లివిరుస్తుంటాయి ".

" రామాలాలీ.... మేఘ శ్యామాలాలీ, తామారసానయనా దశరధ తనయాలాలీ...." అని బిడ్డను జోలపాడతారు పల్లెసీమల్లో తల్లులు. ఇలా ఉగ్గు పాలతోనే రంగరించిపోస్తారు పసిహృదయాలలో ఈ సాహిత్యాన్ని.

సులభగ్రాహ్యంకావడం, పరశపదాలతో జానపదులరసతాగ్రాల మీద సహజంగాదొర్లడం, అంతర్లీనంగా చక్కనితూగుకలిగిఉండటం ఈ సాహిత్య లక్షణం. పాశ్చాత్యదేశాలలో వారివారి జానపదవాజ్మయ సేకరణలో చాలా కృషి జరిగించి. కాని భారతీయభాషలలోమాత్రం ఇద్ అంతంతమాత్రం - తెలుగులో మరీ అత్యల్పం. శ్రీ నేదునూరి గంగాధరంవంటి ఏకొద్దిమందోతప్ప దీనిమీద దృష్టిసారించినవారు తక్కువ.

ఈ సాహిత్యం అజ్ఞాతకర్తృత్వం. అనాదినుండీ ఆనోటినుండి ఆనోటినుండి ఆనోటికి పరంపరానుగతంగావాచ్చిందిమాత్రమే. రాతకోతలు లేవు. కవిఎవరోతెలియదు. బహుశా వారికి మనలాగ పేరుమీద మక్కువ తక్కువేమో! ఎవరువ్రాశారో తెలియనట్లే ఏకాలంలో వ్రాసిందీ అసలే తెలియదు. దీని పుట్టుక చాలా సహజమైనది. మనిషి కాలక్షేపానికి కూనిరాగం తీసుకున్నట్టే కష్టాల్లోనూ, సుఖాల్లోనూ విందుల్లోనూ వినోదాల్లోనూ విలాసాల్లోనూ కులాసాల్లోనూ తనకుకలిగిన అనుభూతిని తానెరిగినభాషలోప్రవచించిఉంటాడు. అందులోశిష్టమైనవి కాలంతోపాటు మార్పులు చేర్పులు


T నాట్యకళ 1970 ఫిబ్రవరి - మార్చి నేదునూరి గంగాధరం పుట 162