పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధైర్యంగా తిరగవచ్చు అని. కాని ధ్వన్యర్ధం ఇక్కడ భయంకరమైన సింహం తిరుగుతోంది, కనిపిస్తే తినేస్తుంది, రాబోకు అని భయపెట్టడం; (అతని అడ్దు తొలగించుకోవడానికి.0"

నహి చమత్కార విరహిత్5అస్య కనీ: కవిత్వం, కవ్యస్యవా కావ్యత్యం' అన్నాడు మరో ప్రాచీనకవి క్షేమేంద్రుడు కవికంఠాభరణములో. అంటే చమత్కారం కవిత్వం అని దీనికి ఉదాహరణగా ఈ క్రింది పద్యం చెపుకోవచ్చు.

'స్సర్వజ్ఞ నామఢేయము
 శర్వునకే చెల్లురావు సింగ జనపాలునకే
 యుర్వింజేట్లేడి నితరుని
 సర్ఫజ్ఞండనుట కుక్క సామజ మనుబే".

రెడ్దిరాజుల ఆస్థాన కవియైన శ్రీనాధుడు ఒకసారి వారికి శత్రువైన సర్వజ్ఞసింగభూపాలుని స్తుతిస్తూ "సర్వజ్ఞడనే పేరు ఒక్క ఈశ్వదునికే చెల్లుతుంది, రావు సింగ భూపాలనకే చెల్లుతుంది, ఇతరులవరినైనా సర్వజ్ఞడంటే కుక్కను ఏనుగన్నట్టే" అని పద్యం చెప్పాడు. దానికి ఆనందపడి ఆ భూపాలుడు బ్రహ్మరధం పట్తి సన్మానంచేసాడట. తిరిగి శ్రీనాధుడు రెడ్ది రాజుల ఆస్థాననికి వచ్చినప్పుడు మన శత్రురాజుల పొగడి మనకు అవమానం తెచ్చిన ఇతనికి ఏమి శిక్ష విధించాలని ఆలోచిస్తుంటే తానేమీ పొగడలేదనిఈ, నిజానికి నిందించాననీ అదే పద్యం ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా చదివి వినిపించాడట ఇలాగ.

"సర్వజ్ఞ నామ ధేయయము
 శర్వునకే చెల్లు, రావు సింగ జనపాలునకే
 యుర్వింజెల్లెడి! నితరుని
 సర్వజ్ఞండనుట కుక్క సామజమనుటే" అని-

చిన్న ప్రశ్నార్ధకంతో అంత స్తుతీ కూడా నిందార్ధంలోకి మారిపోయింది. సర్వజ్ఞడనే పేదు ఈశ్వరునికే చెల్లుతుంది. రావు సింగ భూపాలనకెక్కడ చెల్లుతుంది? శివుని కాకుండా మరెర్నయినా సర్వజ్ఞడంటే కుక్కను ఏనుగన్నట్టే. అంటే సింగభూపాలుని కుక్క అన్నాడన్నమాట.