పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూర్వ నిర్వచనాలిలా ఉండగా ఆధునికంగా మహాకవి శ్రీ శ్రీ -

"కదలేదీ కదిలించేదీ
 మారేదీ మార్పించేదీ
 పను నిద్దుర వదిలించేదీ
 మును ముందుకు సాగించేదీ" కవిత్వమంటారు.

అంటే ప్రజలను ఉత్తేజితులను చేసి ముందుకు నడిపించేది కవిత్వమని, దీనికి ఉదాహరణగా ఆయన 'మహా ప్రస్థానం ' లోని ఈ దిగువ గేయం పనికివస్తుంది.

'పతితులర భ్రష్టులార
 బాధాసర్ప దష్టులార
 శనిదేవత రధ చక్రపు
 టిరుసులలో పడి నలిగిన
 దీనులార హీనులార
 కూడులేని గూడులేని
 పక్షులార భిక్షులార
 ఏడవకం డేవకండి
 వస్తున్నా యొస్తున్నాయ్
 జగన్నాధ జగన్నాధ
 జగన్నాద రధ చక్రా
 లవిగవిగో వస్తున్నాయ్".

ఇలా ఎవరేవిధంగా చెప్పినా అవన్నీ తమ తమ కోణాల నుండి చెప్పిన నిర్వచనాలే. అందువల్ల తాము నిర్ఫచించిందే కవిత్వం అనడం మాత్రం సరికాదు. నిజానికి ఇందులో ఏ నిర్వచనాన్ని అనుసరించి వ్రాసినా ఒక మెరుపు వస్తుంది. ఆ మెరుపే కళ - ఆ కళే కవిత్వం.