పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉంటేనా! మన్మధుడేనట. అంటే అతనికి ఒక కన్ను లేదన్నమాట. దీన్నే వ్యంగ్యమని కూడా అంటారు. ("కన్నొకటి లేకయున్న కౌరవపతివే" అనే పాఠ్జాంతరం కూడా ఉంది.0

"ద్వని కాయాత్మ" అన్నాడు ఆనందవర్ధనుడు. ధ్వని అంటే విషయం వాచ్యంకాకుండా ధ్వన్యాత్మకంగా మరో అర్ధాన్ని స్ఫురింపజేయడం. ఉదాహరణగా కావ్యాలంకార సంగ్రహంలో చెప్పిన ఈ క్రింది పద్యాన్ని పేర్కొనవచ్చు -

'ఇచట మా యత్త పండు, నేనిట పరుందు
 పగటనే లెస్సగని గుర్తుపెట్టుకొనుము
 ఓ నిశాంధుడా సాంధుడా ఒప్పుదప్పి
 పడమీ మాదు మంచాలపైన రేయి"

ఇది ఒకప్రోషితభర్తృక తన ఇంటికి వచ్చిన బాటసారితో అన్న మాటలు. పైకి కనిపించేఅర్ధం ఇక్కడ మా అత్తమంచంఉంటుంది - ఇక్కడ నా మంచంఉంటుంది - రాత్రి ఏదైనా అవసరంకలిగిబయటకు వెళ్ళాలంటే చీకట్లో ఈ మంచాలమీదపడతావు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నట్లుంది. కాని ధ్వనిరూపంగా అతనికందించే సమాచారం -

'రాత్రి నా మంచం ఇదిగో ఇక్కడుంటుంది. తిన్నగ్తా చూసి గుర్తించుకొని దానిమీదకురా - సరిగా చూసుకోకుండా నామంచం అనుకొని మాఅత్త మంచం మీదపడ్డావా కొంప మునుగుతుందీ" అని, ఇలాంటిదే మరొకటి-

"ఇక దిరుగ వచ్చు నిటన
  మ్మకముగ, నోపూజారీ, పరిమార్చెను సుమ్మీ
  సికబోద్ధతమగు గోదా
  నికుంజగతి సింహ మొకటి నేడా కుక్కన్"

ఒక కలట తాను ప్రియునితెఓ కలిసే ఉద్యానవనంలో పూలుకోసుకోడానికి వచ్చే పూజారితో అన్న మాటలివి. పైకి కనిపించే అర్ధం 'ఓ పూజారీ! ఇక్కడ కుక్కను ఇవాళ సింహం తినేసిందిలే, ఇక కుక్క భయంలేదు,