పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/164

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


'ససైన్య పరిభోగేన గజదాననుగందినా
 కావేరీ సరితాం ప్రత్యుశ్శంకనీయాం కరోత్"

అనివ్రాసాడు. రఘు మహారాజు సైన్యాలు దక్షిణ దేశ దండయాత్రకు బయలుదేరి కావేరీనదిని దాటుతున్నాయట - ఆ మదించిన ఏనుగులు నదిలో నీళ్ళు త్రాగుతుంటే వానిగండ స్థలం నుండి కారిన మదజలం నదిలో కలిసిందట. కావేరి సముద్రుణ్ణి కలిసినప్పుడు ఏవిటీ వాసన? ఎవరి దగ్గర కెళ్ళొచ్చావ్? అన్నాడట. ఇందులో కూర్చిన అలంకారం ఇంగ్లీషులో 'పెర్సానిఫికేషన్ ' అంటారు. అంటే మానవేతర ప్రాణులకు మానుషత్వం ఆపాదించి లోకరీతిని మాట్లాడించడం.

'ఔచిత్యం రససిద్దస్య స్థిరం కావ్యస్య జీవితం' అన్నాడు క్షేమేంద్రుడు. అంటే ఔచిత్య్హం కలిగినదే కవిత్వం. దీనికి ఉదాహరణగా 'బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ ' అనే దానిని తీసికోవచ్చు. లలిత సుందరమైన కావ్యం అనిచెప్పడానికి 'కావ్య కన్యక ' అనడంలోనే ఎంతో సుకుమారత్వం వెల్లివిరుస్తోంది. దానికి కోమల కూడా చేరింది - ఆ కోమలం కూడా నవపల్లవకోమలం - అంటే లేచిగురువంటి కోమలం - అదికూడా రసాలసాలనఫపల్లవ కోమలం. అంటే గున్నమామిడిలేచిగురువంటికోమలం. దానికిముందు బాలకూడా చేర్చడం ఔచిత్యపోషణకు పరాకాష్ఠ. వింటుంటే ఒక అనిర్వచనీయానందం కలుగుతుంది. ఈ ఔచిత్య శిల్పసౌందర్యాన్నే కవిత్వంమంటాడు క్షేమేంద్రుడు.

"వక్రోక్తి కావ్యజీవితం" అన్నాడు కుంతకుడు. వక్రోక్తి అంటే చెప్పదలచిన దానిని సూటిగాచెప్పకుండా భంగ్యంతరంగా చెప్పడం. ఉదాహరణకి తిరుమలరాయని వర్ణిస్తూ ఒక కవి చెప్పిన పద్యం ఇది.

"అన్నాతి గూడ హరుడౌ
  అన్నాతిని గూడకున్న అసుర గురుండౌ
  అన్నా తిరుమల రాయా
  కన్నొక్కటిలేదు గాని కంతుడు గాడే"

తిరుమలరాయుడు భార్య దగ్గర ఉంటే పరమేశ్వరుడివలె ఉంటాడట - ఆమె దగ్గరుంటే దేవగురువు శుక్రుడులా ఉంటాడట - మరో కన్ను