పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/161

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాస్త్రీయ కళలలో కంటే జానపద కళలలో జీవితం, ప్రజలజీవితంలోని కష్ట సుఖాలు, ఎత్తు పల్లాలు, సుఖదు:ఖాలు ఎక్కువగా ప్రతిబింబిస్తాయి.

ప్రజల భావోద్వేగం పొంగి పొరలడంవలన ఏర్పడినవి జానపద నృత్యాలు. శాస్త్రీయ నృత్యం కట్టుబాట్లలో ఉంటుంది. జానపదుల నృత్యం స్వేచ్చా ప్రవృతి కలది. ప్రజలు రోజూచేసే పనిపాట్లలోని అవయవ సంచలనమే జానపద నృత్యాలకు ప్రేరణ. అంతేగాక ప్రకృతిలోని జంతువుల గమనానుకరణం కూడా వీరికి ప్రేరకాలు. ఉదాహరణకు మబ్బునుచూసి ఆడే నెమలి గంతులు, వేటగానిని చూసి తప్పించుకొనడానికీ, మీదబడాఅనికి పులి, ఎలుగుబంటివంటి జంతువులచేష్టలు, ఆడమగ పక్షులూ, జంతువులూ శృంగారాభిముఖంగా చేసే చేష్టలు ఈ జానపద నృత్యాలకు పునాదులు. ఇది పాటకంటే కూడా ప్రాచీనమైంది. ఇవి శాస్త్రీయ నృత్యాలలా ఏకవ్యక్తి నిష్ఠములుకావు. సమిష్టిప్రాధాన్యం కలవి. అంటే యివి సామూహిక నృత్యాలేగాని ఏకవ్యకికాలు కావు.

పల్లెలలో, జాతర్త్లలో, తిరునాళ్ళలో,అమ్మవారి సంబరాల్లో, దేవుడి ఉత్సవాల్లో ఎలుగుబంట్ల నృత్యం, బుట్ట బొమ్మల నృత్యం, కోయ నృత్యం, భోగంమేళాల నృత్యం, వీధిభాగవతుల నృత్యం, పులివేషాల నృత్యం, తప్పెటగుళ్ళ నృత్యం, వీరముష్టివారి నృత్యం,గంగిరెడ్ల నృత్యం, పండరీభజన నృత్యం, కోలాటం నృత్యం, గారడీల నృత్యం, గరగాట, చెక్కభజనలలోనివి జానపద నృత్యాలే. చెంచునాటకాలు, జముకులకధ, బుర్రకధ, హరికధలలో ప్రదర్శించే నృత్యం, పిల్లల ఆటలలో చెమ్మచెక్క, ఒప్పుల కుప్ప వంటి పాటలకు అణుగుణంగా ఎగిరే నృత్యం కూడా జానపద నృత్యాలే.

                         క వి త్వం

ప్రపంచంలోని మాటల సముదాయం వాజ్మయం. దానిలోని ఒక భాగం సాహిత్యం. "సహితస్వభావం సాహిత్యమ్" అన్నాదు పెద్దలు. అంటే హిత్ముతో కూడినది అని భావమంటే రసమనికూడా అర్ధం వుంది.