పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రికార్డింగు డాన్సు:-

సినిమాలలో నటీనటులు చేసే సినిమా డాన్సుల్ని అనుకరిస్తూ, ఆ పాట రికార్డు వేసుకొని చేసే నృత్యం ప్రదర్శనలు రికార్డింగు డాంసులు. ఈ ప్రదర్శనల ఉధృతం ఒకనాడు పౌరాణిక నాటక రంగాన్ని కూడా ప్రక్కకునెట్టేసింది. రాజమండ్రి చక్రవర్తి, ఉదయకుమార్ ల రికార్డింగు డాన్సులు చూసి అసలు సినిమా నటులే అదిరిపోయారట.

డిస్కో డాన్సు:-

ఈ మధ్య మహోజ్వలంగా వెలిగిపోతున్న మరో డాన్సు డిస్కో డాన్సు, పాశ్చాత్య సంగీతం, బేగ్రౌడ్ గా, ఆ లయలో కాళ్ళూ, చేతులూ, వొళ్ళూ, ముందుకూ వనక్కూ ఊపుతూ యువతను బాగా ఆకట్టుకుంటున్న నృత్యాలివి. డిస్కో లైటింగు కూడా జోడించి చూపిస్తుంటే యువలోకానికి ఇవి సుందర స్వప్నాలే. ఇప్పుడు ఉధృతంగా వస్తున్న బ్రేక్ డాన్సులు కూడా ఈ కోవలోనే.

కెబెరా డాన్సు:-

ఇవి పూర్తిగా సెక్స్ డాన్సులు. సినిమాల్లో జ్యోతిలక్షి, జయమాలిని, సిల్క్ స్మిత, అనూరాధ చేస్తుంటారు. క్లబ్బుల్లోనూ, ఖరీదైన బడాహోటళ్ళలోనూ, ఎమ్యూజ్ మెంటు పార్కుల్లోనూ వీనివెలుగు వర్ణనాతీతం. వీనిలో ఏది గొప్ప అనేది ప్రశ్నకాదు. దేని ప్రేక్షకులు చానికున్నారు. ఓటింగు పెడితేమాత్రం శాస్త్రీయ నృత్యానికి డిపాజిట్టు గల్లంతే.

                జా న ప దు ల నృ త్యా లు
  • "ప్రజల మధ్యనే పుట్టి పెరిగే నృత్యం, సంగీతం, చిత్రలేఖనం మొదలైన జానపద కళలకు స్వ్గత స్సిద్ధంగా ఉండే విలువ మాట అలాఉంచి, పరిణతి చెందే కళాకరులకు, ఆ కళల తొలిరూపాలకు గల సంబంధం వ్యక్త పరచగలవె ఈ జానపద కళలు మాత్రమే"

  • కమలాదేవి చటోపాధ్యాయ "భారతీయ జానపద నృత్యాలు" ముందుమాట. పుట. 1