పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇందులోని కళాత్మక భాగమే కవిత్వం. ఇది ఇలాగుంటుందని చెప్పడం ఎలా? పినిశెట్టి 'దత్తత ' నవలలో ఒకనాస్తికుడైన కొడుకు పూజచేసుకుంటున్న తల్లిని ఎందుకమ్మా ఈ పూజలు అసలు దేవుడనేవాడు లేంది? అంటాడు. ఉన్నాడు నాయనా అంటుంది. ఎలా ఉంటాడో చెప్పు అంటాడు. ప్రక్కనున్న మేనకోడలు బావా! బెల్లం ఎలాగుంటుంది? అంది, తియ్యగా ఉంటుంది అన్నాడు. తీపెలాగుంటుంది? అంది అతను అవాక్కయ్యాడు. తీపికి రూపం ఏవిటి? అలాగే కవిత్వ్ం కూడా అయినా పెద్దవాళ్ళు దీన్ని నిర్వచించడానికి కొంత ప్రయత్నం చేశారు.

'Emotions Recollected in Tranquility' అంటారు వర్డ్సువర్తు. నిశ్చ్ల స్థితిలో పరిపూర్ణమైన ఆవేశంతో హృదయంనుంచి వెలువడే వాక్ప్రవాహం కవిత్వమన్నమాట. దీనికి వాల్మీకి 'మానిషాద ' శ్లోకమే సాక్ష్యం. అతని రామాయణ మహాకావ్యమే నిదర్శనం.

"poetty is musical thought" అంటారు కార్లయిల్ అంటే "గాన సమన్వితమైన ఆలోచనకవిత్వం" అని అర్ధం. దీనికి ప్రఖ్యాత కవి కీట్సు వ్రాసిన "ఘ్రీషియస్ ఆర్న్" అనే ఖందిక ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇందులోని "Heard melodies are sweet, but those unheard are sweeter, Ye soft Pipes Play on" "వినిపించే గానం మధురం, వినిపించని గానం మధురాతి మధురం, మ్రోయించవోయ్ మురళి" అనే దానిలో ఒక తూగు ఉంది. భావ ప్రకటనలో అంతరాంతరాలను కదలించే ఒక శక్తి ఉంది. ఇదే గాన సమన్వితమైన ఆలోచన. ఇది ప్రపంచ ప్రసిద్దిపొందిన కవిత.

ఇంతకీ "పొయట్రీ' అంటే వైఘంటి కార్ధం కవిత్వం కాదు పద్యం. మరి పద్యమే కవిత్వమనుకుంటే పై లక్షణాలు కలిగి ఉన్న వచనము కవిత్వం కాదా? అందువల్ల 'పొయట్రీ ' అనేదానికి కవిత్వం అనే అర్ధం కూడా వ్యవహారంలో వచ్చింది. భారతీయ పండితులుకూడా కవిత్వాన్ని నిర్వచించలేదు - కావ్యాన్ని నిర్వచించారు. అయితే "కవయతీతి కవి: తస్య కర్మ కావ్యం' అన్నారు. అంటే కవిత్వం చెప్పేవాడు కవి, అతను వ్రాసింది కావ్యం అని. దీన్నిబట్తి కవిత్వ స్వరూపం కావ్యం గనుక కావ్యం అంటే కవిత్వం అని నిర్ధారించారు.