పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                       ఆహార్యం ఛంద్ర తారాది
                       తం వందే సాత్త్వితం శివం'

అంగికం,సాత్త్వికం, ఆహార్యం, వాచికం అని అభినయాలు చతుర్విధాలు. రూప ప్రధానమైన ఆహార్యం - అంటే వేష ధారణ. తాళానుగుణంగా, భావానుగుణంగా కదలికలు, ముద్రలు అంగికం. నోటితో ఉచ్చరించేది వాచకం. రోమాంచ కంవశ్వేదాదులు సాత్త్వికం. నాట్య నిర్వఃఅణ ఎలా ఉండాలి అనేది ఈ క్రింది శ్లోకంలో చెప్పబడింది.

                           "యతో హస్త స్తతో దృష్ఠి:
                             యతో ద ష్ఠి ంతతో మన:
                             యతో మన స్తతో భావ:
                             యతో భావ స్తతో రస:"

(హస్తము, దష్టి, మనస్సు, భావము ఒక దానిమీద ఒకటి లగ్నమై రసనిష్పన్నత నొందాలి)

                           "కంఠే నాలంబయేద్గీతం
                             హస్తే నార్ధం ప్రదర్శితం
                             చక్షుద్భ్యాం దర్శయద్భావం
                             పాదాభ్యాం తాళమాచరేత్"

(కంఠముచే గానము, హస్తముచే అర్ధము, నేత్రముచే భావము, కాలిచే తాళము నడుపబడాలి) నాట్యానికి ఇవి అంత:ప్రాణాలు. ఇకబహిప్రాణాలు.
                           
                            "మృదంగశ్చ సుతాళశ్చ
                              వేణు గీతీ స్తతస్తుతి:
                              ఏక వీణాకింకిణీశ్చ
                              గాయకతృశ్చ సువిస్రుత:"

మంచి తాళం, మృదంగం, పిల్లన గ్రోవి, పాట, వీణ, గజ్జెలు, ప్రఖ్యాతమైన నటుడు - ఇవి బహిప్రాణాలు. ఇవన్నీ శాస్త్రీయనాట్యాలకు మూల సూత్రాలు. నాట్యాన్ని శాస్త్రీయంగా నృత్తము, నృత్యము, నాట్యము,