పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/157

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుణంగా సంగీత సాహిత్యములు ఏకకాలంలోనే ఉబికి వస్తాయి. కలుపు తీత, గొప్ప తవ్వు, ఊడ్యులూ చేస్తున్న పల్లె పడుచులు వారివారి వృత్తి ఏతాళంలో జరుగుతూ ఉందో అదే చతురశ్రగ్తిలో అప్రయత్నంగా పాడుతుంటారు. మగవారు తరువులు మోయుట, నూర్పిళ్ళు, ఎగుమతి దిగుమతి సందర్బాలలోనూ తమకు శ్రమ తెలియకుండా ఆవనికి సరిపోయే లయతాళ బద్ధాలుగా బృందగీతాలు పాడుతూ ఉంటారు. ఈ సాహిత్యంలో సంగీతం ఉట్టిపడుతుంది".

                             నా ట్యం
  • "పకృతియందలి సర్వవస్తువులయొక్క చలనమునందు 'లయ ' అంతర్నిహితముగా నున్నది. దానికి తోడుగా ప్రకృతియందు వివిధ రూపములలో మధుర శబ్దోత్పాదనము పాదుకొనియున్నది. నిత్యజీవితమున ప్రతియంశమునందును, ఏదో ఒకరూపమున లయాన్విత శబ్ద స్పూర్తి యుండుటను ఆదిమానవుడు గుర్తించియుండును. దానికొక యాకారము నిచ్చుచు ఆతడనుకరించిన విధానమే నృత్యకళగా భాసించినది."

చతుష్టష్టి కళలలో నాట్య కళ విలక్షణమైనది. మొదట ఆదిమ మానవుడు తన భావాలను తెలియజేయడానికి సౌంజ్ఞలు చేసేవాడు. ఆనందం కలిగినప్పుడు గంతులు వేసేవాడు. అవి లయబద్ధమై నాట్యమయింది. పెద్దలు దీనిని పంచమ వేదమన్నారు. ఋగ్వేదం నించి సాహిత్యం, సామవేదం నుంచి గానం, యజుర్వేదం నుంచి అభినయం, అధర్వణ వేదం నుంచి రసం తీసుకొని బ్రహ్మ అయిదవ వేదాన్ని సృష్టించాడని, భరతుడు దీనిని ప్రవర్తింప చేశాడని ప్రతీతి. ఇందులో మహా నటుడు పరమేశ్వరుడు.

                   'ఆంగికం భువనం యవ్య
                    వాచికం సర్వ వాజ్మయం
                      


  • తెలుగు జానపద గేయకధలు. పు. 1 డా|| నాయని కృష్ణకుమారి.