పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తాండవము, లాస్యము అని అయిదు భాగాలుగా పేర్కొన్నారు. ఇందు చత్ర్విధాభినయాల్లో అంగికానిది అగ్రతాంబూలం. మానవశరీరమునకు సంబందించిన ప్రధాన అంగముల చేష్టలే ఆంగికము. శిరస్సు, చేతులు, రొమ్ము, పార్శ్వము, పాదములు యిక్కడ ప్రధాన అంగాలుగా చెప్పబడతాయి. ఈ అంగికమ్లో హస్తాభినయముద్రల ప్రాముఖ్యం అత్యదికం. ఒక చేతితో పడితే అసంయుత ముద్ర, రెండు చేతులతో పడితే సంయుత ముద్ర. యిక మూడవది మిశ్రమ ముద్ర. వీని నిర్వహణా కౌశలమే యీ కళకు గీటురాయి.

ఇప్పుడు ఆంధ్రదేశంలో ప్రఖ్యాతిగా నడుస్తున్న నాట్యప్రదర్శనము అయిదు విధాలుగా విభజించవచ్చు.

1. శాస్త్రీయ నృత్యం, 2. జానపద నృత్యం, 3. రికార్డింగ్ డాన్సు, 4. డిస్కో డాన్సు, 5. కేబెరా డాన్సు

శాస్త్రీయ నృత్యం:-

భరతనాట్యం, ఆంధ్రనాట్యం, కూచిపూడి ఈ తరగతిలోకి వస్తాయి. వీనికి శాస్త్రపడికట్తు ఆయువు పట్టు. తెలుగువారిలో నటరాజ రామకృష్ణ, వేదాంతం సత్యనారాయణశర్మ, వెంపటి చిన సత్యం, కోరాడ నుసింహారారు, పసుమర్తి కృష్ణమూర్తి యీ నాట్యాలకు ఖండాంతర ఖ్యాతి తెచ్చిపెడుతున్న జాతిరత్నాలు.

జానపద నృత్యం:-

గిరిజనులయొక్క, పల్లీయుల యొక్క సంప్రదాయక రీతి నాట్యాల అనుకరణ ఇది. కోయడాన్సు, లంబాడీ డాన్సు, కోబ్రా డాన్సు, కోతి డాన్సు, పాములవాడు, జాలరి వంటివి ప్రదర్శింపబడుతున్నాయి. 'మొక్కజొన్న తోటలో ' లాంటి జానపద గీతాలకు రూపకల్ప నచేసి, కొన్నిభావ గీతాలను అభినయం గూర్చి శాస్త్రీయం కాకున్నా వీనికి కూడా సభా గౌరవం తెచ్చారు మనవాళ్ళు.