పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కష్ఠంసుఖాదికాత్మకమైన ద్వంద్వ ప్రకృతి నుంచి
తట్టుకొనలేని హృదయమునకు గిలిగింతలు పెట్టి
కళ మానవుని లాలించి, పాలించును. తన
సృజనాశక్తి యాధారముగా జీవితమును
మానవుడు లలిత మధురంగా చేసుమొనును
యత్నము నందే కళ ఉద్భవించినదో.

"మానవుడు ఆర్థిక, సాంఘిక, విఅజ్ఞానిక రంగాలలో మాత్రమే వికాసం చెందితే ఆర్ధికపుష్ఠి, సాంఘిక గౌరవం, విజ్ఞానదీప్తి, అభివృద్ధి చెందుతాయేమోగాని జీవితం లో ఒక శుష్కత్వం, ఒక నీరస భావం, ఒక నిరానందం మాత్రం తొంగి చూస్తూనే వుంటాయి. కళారంగం ఈ లోటు తోలగిస్తుంది"

                                               --సంజీవదేవ్

(**) అందమివ్వడమే కళకు ఉద్దేశం, కళలో పాతా, కొత్తా, ముందూ, వెనుకా ఇవేమీ లేవు. ఇంకా దీని ప్రయోజనమేమిటని అడగడం గుడ్డితనం, అంత ప్రయోజనాకారి ఇంక ఉండదు. గ్ంతలు కట్టుకొని నువ్వు వాంచించేప్రయోజనాన్ని నెరవేర్చలెదు కనుక దానివలన ప్రయోజనం లేదనడం చాలా సంకుచితం".

"కవి, గాయకుడు, ఫిలాసఫర్ వీళ్ళకి స్వేచ్చలేని దేశం, కాలం, ఘోరం. చాలా త్వరలో మనుషులు మరలు, కీలుబొమ్మలు, రాక్షసులు, రాబర్ట్వులుగా తయారవుతారు."

"ఒకదేశ ఔన్నత్యాన్ని ఎత్తిచూపేవి కళలు మాత్రమె, గ్రీకు, రోము దేశాలు హొమరు, వర్జిల్ కావ్యాలవల్లే పేరుపొందాయి. కాళిదాసు, భవభూతి వంటి కవులవల్లా, అజంతా, ఎల్లోరా శిల్పాలవల్లా, తాజ్ మహల్ వంటి కళాఖండాలవల్లా, తాన్ సేన్, త్యాగరాజులవంటి సంగీత వేత్తలవల్లనె భారతదేశం జగత్ ప్రసిద్ధి పొందింది. అలాగే రఫేల్, బెతోవన్, షేక్సుపియర్ వంటివారు జన్మించిడం వల్లే ఆయాదేశాలు నలుగురు నోళ్ళళ్ళోను ఘనంగా కీర్తించబడుతున్నాయి."


(**) శ్రీ గుడిపాటి వెంకటచలం "చలం - కళ" నుండి.