పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంగీతం:-

సంగీతం అపార మధురం కానీ కంటికి కనిపించదు. నిరాకారం.

క వి త్వం:-

కవిత్వం కేవలం అక్షరూపం, శిల్పం, చిత్రలేఖనం దృశ్య మానమ్లు. చూసి ఆనందించేవి. అందువలన వీనిని దృశ్యకళలన్నారు. సంగీతం, కవిత్వ్గం శ్రవ్యగోచరాలు గాన వానిని శ్రవ్య కళలన్నారు. నాటకం, నాట్యం వంటివి సమాహారే కళలు. వీనిలో దృశ్యం, శ్రవ్యం కూడా వుంటాయి.

కళనను గురించి:-

"ఆర్ట్ పర్ ఆర్ట్ సేక్" అనేది ఒక వాదం, "ఆర్ట్ ఫర్ ది పీపుల్" అనేది ఒక వాదం అనాదిగా అనంతంలా సాగివస్తున్నాయి.

"ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్" (కళ కళకోసమే) అనేది వైయుక్తికం. దీనికి అత్యానందం ప్రధానంగా చెప్పుతుంటారు. కాని వాస్తవానికి కళాకారుడు ఎటువంటి ప్రలోభాలకీ లొంగక తాను దర్శించిన సత్యాన్ని ప్రదర్చించడమనేది దీనిలోని భావం.

"ఆర్ట్ ఫర్ థె పీపుల్" అనే వాదంలో కళ ప్రజలను చైతన్య వంతులుగా చేసే ఉపరరణంగా ఉపయోగపడాలనేది వీరి వాదం.

కళ భావాత్మకమైన మానవసృష్ఠి. సృష్ఠిలోనున్నదానిని యధాతధంగా అనుకరించుట, ఉన్నది ఉన్నదున్నట్టుగాక తన మనో నేత్రానికి గోచరించినట్లుగా చిత్రించుట, సృష్ఠిలో పొందలేకపోయిన దానిని తన భావంతో ఉత్తమమైన, ఉన్నతమైన జగత్తును సృష్ఠించుట అనునవి కళారూప కారకాలు.

లలితకళల ప్రయోజనాల గురించి పలువురు పండితులు ఈ క్రింది విధంగా అభిప్రాయాలు వెలుబుచ్చారు.

(*) "కళ మానవుని జీవితమును మాధిరీ మహితమును, సమరేస సుందరమును నొనర్చును.


(*) శ్రీ మారేకళ్ళ నాగేశ్వరరావు "కళాకారుడు - సమాజము" వ్యాసమునుండి.