పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కళ సంస్కారాన్ని సంక్రమింప జేస్తుంది. సంస్కారం సూక్ష్మ దృష్టిని కలిగిస్తుంది. విజ్ఞానాన్ని పంచడం, వివేకాన్ని పెంచడం, ఆనందాన్ని అందించడం, లలితకళల పరమావధి. జీవితం ఆటుపోటులను అధిగమించి ఆనందంగా జీవించడానికి కళలు తొడ్పడతాయి. కళకు కులమత భేదాలు లేవు. ప్రాంతీయ విభేదాలు లేవు-

ఆడామగా వివక్షత లేదు. అన్నిటికీ అతీతం కళ

                        శి ల్పం

"శిలలపై శిల్పాలు చెక్కినారూ, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారూ.."

ఒక జాతి చరిత్ర, సంసృతులును తెలియజెప్పేవి ఆకాలంలో వెలసిన కళలే. అందులో శిల్పకళ ప్రత్యేకత మరింత, వ్రాత కందని చరిత్రను కూడా యీరాతి ప్రతిమలందిస్తున్నాయి. ఏ కళ అయినా ఆదిలో ప్రకృతి అనుకరణ తోనే ప్రారంభమయ్యింది. శిల్పి కూడా తాను చూసింది రాయిలో చెక్కేడు. అవే వన్యమృగాలైన ఏనుగులు, జింకలు, లతలు, పక్షులు, వృక్షములు వగైరా, తరువాత్ర మత ప్రచారంతో దేవతా ప్రతిమలు సృష్టించాడు. తరువాత సౌందర్యారాధనలో మధుర మంజుల మనోహర మోహనాకృతులైన ఊహాసుందర సుందరీ మణుల సజీవ మూర్తులుగా సృష్టించి చరిత్రకే విశిష్టతను చేకూర్చాడు.

ప్రకృతిలోని ఎనబై నాలుగు లక్షల జీవరాసులను ఒకదానికొకటి పోలికలేని కోట్లాదిరూపాలతో సృష్టించిన మహాశిల్పి బ్రహ్మ అనుకుంటే ప్రాణం దక్క మిగిలినదంతా ప్రతి సృష్టి చేసిన మహా మేధావి మానవ శిల్పి. పురాణకాలంలో పేరెన్నికగన్న గొప్ప శిల్పి 'మయుడు '. ఉన్నది లేనట్లుగానూ లేనిది ఉన్నట్లుగానూ సృజించి దుర్యోధనసార్ఫభౌముడంతటి వాడినే సంభ్రమా శ్చర్యాలలొ ముంచెత్తేడు. వాస్తవిక ప్రపంచంలో యిప్పటివరకూ నేలతల్లి ఒడిలో దాగి బల్పడిన శిలా ప్రతిమల ఆధారంగా పరిశోధిస్తే ఈజిప్టు, చైనా, గ్రీస్ , రోం, ఇండియా వగైరా దేశాలలో కీస్తుపూర్వం ఎన్నో శతాబ్ధాలకు ముందే అద్భుత శిల్ప కళా సంపద పెంచి పొషించ బడినదని తెలుస్తోంది. ఇండియాలో క్రీ.పూ. మూడు