పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిత్రణగాని, భావచిత్రణగాని కలవిగాన చిత్రకళలనీ, ఆనందం ప్రధానం గాన విలాసకళలనీ అన్నారు.

కాళిదాసు రఘువంశంలోలలితకళాశబ్ధమే వాడేడు. జయదేవుడు గీత గోవిందంలో విలాసకళాశభ్ధాన్ని వాడేడు.

లలితకళ అనేది మూడు అంశములతో ముడిపడివుంది.

1. సృష్టి, 2. ఆనుకరణ, 3. నేర్పు.

ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము కావ్యహెతువులని చెప్పబడిండి. కవిత్వంకూడా లలితకళలలో ఒకటి కనుక పైన చెప్పబడిన హేతువులు కలలన్నిటికి వర్తిస్తాయి.

                         ప్ర తి భ

T "ప్రతిభను" గూర్చి అభినవగుప్తుడు- "ప్రజ్ఞా అపూర్వవస్తు నిర్మాణక్షమా" అన్నాడు. అంటే - క్రొత్త క్రొత్త వస్తువులు నిర్మించునేర్పు అని అర్ధం.

భామహుడు -"ప్రజ్ఞానవనవోన్నేషశాలినీ ప్రతిభామతీ" అన్నాడు. ఈ ప్రతిభనే ఆదునికులు భావనాశక్తి అనీ, ఇంగ్లీషులో 'పవరాఫ్ ఇమేజినేషన్ ' అనీ వ్యవహరిస్తున్నారు.

                     వ్యు  త్ప  త్తి

"నిపుణతో లోకశాస్త్ర కావ్యాద్యక్షణాత్ " అని పండితులు చెప్పారు.

వ్యుత్పత్తి లోకశాస్త్ర కావ్యాద్రవేక్షణ వలన ఏర్పదుతుంది. అనగా సర్వతో ముఖమైన పాండిత్య విశేషము వ్యుత్పత్తి అని అర్ధం. ప్రతిభ నైసర్గికం - వ్యుత్పత్తి సంపాదితం.


T కావ్యాలంకార సంగ్రహము పు.119