పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అ భ్యా సం

అభ్యాసం గురించి రాజశేఖరుడు "నిరంతర కృత్యవస్తుపరిశీలనమే అభ్యాసమని, దీనివలన అనన్య సామాన్యమైన నేర్పు కలుగు;తుందని వివరించాడు:-

"ఆభ్యాసోహి కర్మణాం కౌశల మానకంతి". అంటే నిరంతరమగు అభ్యాసము వలన కౌశలము కలుగును అని. సామాన్య భాషలో దీనిని చెప్పాలంటే అనగనగరాగ మతిశయిల్లుచునుందు" అని-

పైన చెప్పబడిన "సృష్టికి" ప్రతిభ ముఖ్యం. ఇందు అపూరత స్వతంత్రత నిండి ఉంటుంది. "అనుకరణ" అనేది ప్రకృతి అనుకరణ- సృష్టికి ప్రతిసృష్టి. దీనికి ప్రపంచ విజ్ఞానం చాలా అవుసరం. కనుక వ్యుత్పత్తిపై ఆధారపడి ఉన్నట్టిదిది.

"న్మేర్పు" అభ్యాసంవల్ల అలవడుతుంది. అందుబాటులో ఉన్న సామగ్రితో ఆనందంగా కూర్చగల శక్తియే నేర్పు.

ఈ లలితకళలు మరల శ్రవ్యము, దృశ్య్హము అనిరెండు రకాలుగా విభజింపబడ్డాయి. "రమ్యాణివీక్ష్య మధురాంశ్ప నిశమ్య శభ్ధాన్ " అను శ్లోకంలో కాళిదాసు ఈ విభజన సూచించాడు. శ్రనణేంద్రియములద్వారా ఆనందం కలుగజేసేవి శ్రవ్యకళలు. ఇలాచూసినప్పుడు శిల్పం, చిత్రలేఖనం దృశ్య కళలు; సంగీతం, కవిత్వంశ్రవ్య కళలు.

శిల్పం:-

ఇది రూపప్రధానమైనది. ఒక వస్తువుయొక్క రూపాన్ని చెక్కడం, రాగి, రాయి, మట్టి, కర్ర - మొదలైన విగ్రహ విశేశాలన్నీ ఇందులోకి వస్తాయి.

చిత్రలేఖనం:-

ఇదికూదా శిల్పంవలె దృశ్యమానమే. దీనిలో రంగులు, కుంచె, గోడ మొదలగునవి ముఖ్య పదార్ధాలు. శిల్పంలో చూపలేని ప్రకృతి వైవిధ్యంకూడా ఇద్ చూడగలదు.