పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ పురమనేదానికి నిఘంటువులో స్త్ర్రీలుండే గృహభాగంగా కూడా చెప్పబడించి. దీనినుంచే అంత:పురమనే మాటవచ్చింది. నగరమనగా రాజులు (పాలకులు) ఉండే ఊరు. అదే రాజధాని, ఉదాహరణకు భాగ్యనగరం, విజయనగరం మొదలగునవి. దీనికి పాలనా సంబంధమైన విషయాలపైనా, వ్యాపార వ్యవహారాది విషయాలపైనాదేశవిదేశీయులూ, వివి ధప్రాంతాలవారూ, వివిధ జాతులవారూ రావడం పోవడం జరుగుతుండేది. వీరివల్ల అక్కడ నిసర్గజాతి ఆచార ఆచారవ్యవహారాలు, సంస్కృతి ప్రభావితమై కొత్తపుంతలు త్రొక్కయి అదే నాగరికత అనిపించుకుంటూ, మొత్తంమీద గ్రామాలూ పల్లెలూ తాలూకు విశేషాలు జానపదం క్రిందా, పురమూ పట్టణమూ నగరముల తాలూకు విశేషాలు నాగరికము క్రిందాలెక్కించబడ్డాయి. సమైక్యం, అభిమానం, సహకారం, కట్టుబాట్లు, నియమాలు, జానపదుల అమూల్య సంపదలు. ఇవి లిఖితం కాలేదు. వాక్ నిబద్ధతతో జీవిస్తున్నాయి. నిర్మలత్వం, నిష్కాపట్యం, నిరాడంబరత్వం,జనహితం నిండుగా గూడుకట్టుకున్న గుండెలువీరివి. తిండిలేని ప్రక్కవాణ్ణి చూసిభరించలేని దాక్షిణ్యం వీరి సహజ ప్రకృతి. ఇంట్లో ప్రతిచిన్న శుబకార్యానికి పదిమందినీ పిలిచివేడుకగా జరుపుకోవడం వీరిముచ్చట. వీరి దృష్టిలో అన్నం పరబ్రహ్మస్వరూపం. తాముయింత తింటూ ప్రక్కవారికి యింత పెడుతూ మమతాను రాగాలతో మనసులు పండించుకుంటారు.

"Love thy neighbour" అనే భావం అంతరాంతరాల్లో జీర్ణించుకున్న మానవతామూర్తులు జానపదులు.

పోర్చుగీసువారు, డచ్చివారు, ఆంగ్లేయులు మనదేశానికి వచ్చిన తరువాత మన నగరాలు, పట్టణాలు, పురములలోని మనజాతి సంస్కృతి సంకరమై నాగరికత పేరుతో కృత్రిమ రూపంలోనికి మారిపోయించి. వీరి నివాసాలు ఆ పట్టణాలకే పరిమితమైనందున అక్కడే నవ్యత పేరుతో ఈ నాగరికత పరిఢవిల్లి జాతి సహజ సంస్కృతిని పరిహసించటం ప్రారంభించింది. నగరికులలో పరస్పర విశ్వాసం కరువు - మనిషిని మనిషి నమ్మడు - అన్నీ రాతకోతలమీదే వ్యవహారం - కోర్టులే పరిష్కారం. ఒకతి అవసరానికి ఒకదు సాయపడరు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు.