పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గౌరవ మర్యాదలు అందించింది. విద్యాగౌరవారలు పొందినవారు నాగరిక సంపన్నులుగా పరిగణించబడ్డారు. పాశ్చాత్యులతో ఏర్పడిన సన్నిహితం వల్ల నేర్చుకున్న ఆచారవ్యహారాలే నేడు నాగరికతగా చలామణి అవుతున్నాయి.

ఇక చరిత్రకొస్తే మనకు అనాదినుండీ వాడుకలోనున్న పదములు పల్లె, గ్రామము, పురము, పట్టణము,నగరము అనేవి. పల్లె, గ్రామము పల్లెటూరుకు సమానార్ధకాలు. ప్రస్తుతం పురము,పట్టణము,నగరము నగర శబ్దానికి పర్యాయ పదాలుగా వాడుతున్నారు. కాని కారణం - మానవుడికి గాలి ఎంత ముఖ్యమో నీరుకూడా అంతే ముఖ్యం గనుక. ఈ ప్రాముఖ్యాన్ని సుమతీ శతకారుడు ఇలా చెప్పాడు.

     'అప్పిచ్చువాడు, వైధ్యుడు,
                 నెప్పుడు నెడతెగకపారు నేఱును, ద్విజుడున్
                 జొప్పడిన యూరనుండుము
                 జొప్పడకున్నట్టి యూరజొరకుము సుమతీ '


నదులు కొండలగుండా కోనలగుండా ప్రవహిస్తుంటాయి. ఆహారం కూడా ఆకొండకోనల్లోనున్న చెట్లనుండి పశుపక్ష్యాదులనుండి సులువుగా లభ్యమవుతుంది. అందువల్ల కొంతమంది గుంపుగా నదీతీరం వెంబడి ఒక్కోచోట చేరి స్థావరాలు ఏర్పాటు చేసుకొనేవారు - అవే పల్లెలూ, గ్రామాలుగా పిలువబడుతుండేవొఇ. ఉదాహరణకు కళింగపట్టణం, భీమునిపట్టణం, కాకినాడపట్టణం, విశాఖపట్టణం, మచిలీపట్టణం, చెన్నపట్టణం వగైరా. ఈ ఊళ్ళు పెరిగి పెద్దవై రేవులపట్టణాలుగా తయారై దేశ విదేశీయుల రాకపోకలతో నాగరిక స్వభానాన్ని సంతరించుకున్నాయి.

రాచరికపు వ్యవస్థలో సాధారణంగా సంస్థానధీసులుగాని, సామంతరాజులుగాని ఉండే ఊళ్ళకి ఎక్కువగా పురము అని వాడారు ఉదాహరణకి రమచంద్రపురం, పెద్దాపురం, అమలాపురం, పిఠాపురం, రాజమహేంద్రవరపురం, హేలాపురం, వేంగిపురం వగైరా. ఐతే