పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

               భీరపు కాసారముల వి
శాలశైలముల బడి పూ
              జాకుసుమార్ధము తిరిగెద,
              దేవదేవ శంభో! నిను
              తెలివిమాలి త్రెలియనైతి!
                        ----
                     రామకథాసుధ
         (శంకరుని రామకర్ణామృతమునుండి)

మార్గమందున మార్గమందున
        వృక్షశాఖలు రత్నవేదులు.
వేదులందున వేరులందున
       కిన్నరీబృందములగీతము,
గీతమందున గీతమందున
      మంజులాలాపార్ద్రగోష్ఠిఉ
గోష్ఠియందున గోష్ఠియందున
     నీదుకధయే రామచంద్రా!