పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/200

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వృక్షమందున వృక్షమందున
     వీక్షితములౌ పక్షిసంఘాల్,
సంఘమందున సంఘమందున
    మంజులామోదార్ద్రవాక్యము,
వాక్యమందున వాక్యమందున
     మంజులాలాపార్ధ్రగోష్టియ,
గోష్ఠియందున గోష్ఠియందున
      వీదుకధయే రామచ్ంద్రా!
                     ----
              సీతావిరహము
             (రామవాక్యము)

ప్రాసాదమ్మున వీవే!
     పధము పధమునను నీవే!
వృష్ఠభాగమున నీవే!
     పురోభాగమున నీవే!
పర్యంకమ్మున నీవే!
    పలుదిశలందున నీవే!
కనంబడెద, వౌర, వియో
      గాతురమౌ నామదికిని.