పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లమరు తట్టల దింప వీలైన యెత్తు
రాలదిమ్మ లెత్తించి, మార్గంబులందు
కడకు చలిబాధ వగ్చు నక్కలకుగూడ
వస్త్రదాన మ్మొసంగిన పరేమధర్మ
మూర్తి, లోకాంతరవ్యాప్తికీ ర్తిచంద్రి
కావిరాజితు డుత్తమకవులు భక్త
పరులు యోగులు మొదలుగు వారిచేత
నవరతము పొగడ్తల నంది మున్ను
అమితకీత్రి గొన్నట్టి ధర్మాప్పరాయ
యశము విని మది నెంతౌ నబ్బురపడి
అకట, అతడు నేదు లేదేయని యాత్రి గరదు!
కాని, మదిని క్రీడాసక్తికల్గెనేని
వాలుజడ వేసుకు గులాబివలవ గట్టి,
పొంకమౌ వేణి చామంతిపూలు ముడిచి,
ముద్దుమోమున నిల్వుగా బొట్టు వెట్టి,
పుక్కిల విడెమ్ముతో, నుల్లిపరలపైట
'సెంటు చేను కెకరమ్ము కలచె ' యన జెల్లు
పద్ద లంగా పయిం దాల్చి, వీధు లూడ్చు
చును విటుల నోరచూపుల జూరగొంచు
చక చకను వచ్చు నాదాసి జారుపైట