పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/171

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డదికాలచక్రాహతి న్నేల గూలిపోవ,
నేడు శిధిలమ్ములై కోటగోడ లవిగో,
పేదలై కనుపట్టుచు ఖేద మొసగు !
వేణుగోపాలు భక్తి సేవించి, పిదప
మాన్యులౌ మత్పూర్వు లమాత్యవరులు
ఆర్యధర్మపద్ధతియు లోకానుభవము
మెండుగ నెఱింగి ఠీవితో నిండుసభను
రాచకార్యాలు దీర్చిన రచ్చచింత
నీడ నొక్కీంతనిలిచి, మావీడు మున్ను
జెలగినట్టి చోటును గాంచి, చెలిమి కాని
పూర్వవైభవమున్ దలపోసి చనుమ !
పాయె నానాటిపూర్వుల వైభవమ్ము,
మాసె వరిపరాక్రమమహితదీప్తి,
కాలగతి మార్పు లెన్నేని కల్గుచుండు
చక్రనేమిక్రమమ్మున జగతిలోన !
వేసవిన్ దహముం గొన్న పిట్త్రలకును
దొన్నెల న్నీరు వోయించి, యెన్నతరము
కాని భూతదయన్ దోమకాటుగన్న
పనులు మేను రాచికొనగ బండరాళ్ళ,
గొల్లభామలు బరువైన చల్లకుండ