పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


*[1]హితోపదేశము

చాటొద్దా నీకు మాటొద్దా?
చిన్నదానవు నీకు సిగ్గొద్దా?
ఆసీమ యీసీమ
అంద రందాలు
దిద్దంగ బిళ్లేరి
అద్దమౌతావా? || చాటొద్దా ||

     ముందు మన పాపణ్ణి
     కింద దిగనీక
     ఎత్తుకొని నలుగురూ
     వొత్తిపారెయరా || చాటొద్దా ||

చిట్టి నువు దేవతై
చేసేటి దేమే?
రచ్చకె క్కొట్టినే
రద్ది పదతావా?
చాటొద్దా నీకు మాటొద్దా?
చిన్నదానవు నీకు సిగ్గొద్దా?

  1. * With apologies to Mr. Nanduri Subba Rao.