పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కమ్మని పూరీలోయ్‌ బావా!
కర కర వేచానోయ్‌ బావా!
కరకర వేగిన పూరీలతో నా
కాంక్ష వేపినానోయ్‌ బావా!
    కనికరించి తినవోయ్‌ బావా!

వెన్నెల యిదుగోనోయ్‌ బావా!
కన్నుల కింపౌనోయ్‌ బావా!
వెన్నెలలో నా కన్నెవలపనే
వెన్న గలిపినానోయ్‌ బావా!
    వేగముగా రావోయ్‌ బావా!

పువ్వుల సెజ్జిదిగో మల్లే
పువ్వుల బరిచిందోయ్‌ బావా!
పువ్వులలో నా యవ్వనమంతా
పొదిపిపెట్టినానోయ్‌ బావా!
    పదవోయ్‌ పవళింతాం బావా!