పుట:Geetham Geetha Total.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ దైవము తనలోయుంటే, అడుగడుగన తానెయుంటే
గుడులేల - యాత్రలేల ॥ఆలయమేలా॥



చిత్రము : సువర్ణ సుందరి (1957)
పాట : పిలువకురా - అలుగకురా
""""""""""""""""""""""""""""""""""""""""""""""
సాగుమురా.... ధైర్యముగా....... గురుదరి చేరగ ఓ జీవా...
పరమును చూడగ ఓ జీవా.....

1) మనసున చింత - విడువగ లేవా
గుణముల - త్రుంచగ - తలుపగ లేవా
కర్మల వేగమే - కాల్చగ లేవా
రయముతో - గురునీవేళ - ప్రార్థించగరారా ॥సాగుమురా॥

2) గురు పద సేవ - మరువక నీవు
మనసున - నిలిపి - పూజలు చేయ
నిను గురువేగమే - చేకొను లేరా
దయచూపి - నీకీవేల - బోధించును లేరా ॥సాగుమురా॥

3) పాపపుణ్యము - విడచినవాడు
శ్రీగురు - దరిచేరి - కొలచినవాడు
కనుగొను వేగమె - ఆత్మను వాడు
ధరణిలో - గురువీరీతి - బోధించేనులేరా ॥సాగుమురా॥

4) ప్రబోధ గురుని - చేరిన నీకు
జన్మలు - స్థిరముగ - పోవును లేరా
జ్ఞానము చేకొని - నడువుము నీవు
కరుణాతో - నిన్నీవేళ - కాపాడును లేరా ॥సాగుమురా॥