పుట:Geetham Geetha Total.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రము : చిరంజీవులు (1956 )
పాట : కనుపాప కరవైన కనులెందుకో
""""""""""""""""""""""""""""""""""""""""""""""
గురుబోధ బరువైన మనిషెందుకో
గురుకంటే పరుడైన బ్రతుకెందుకో ॥గురుబోధ॥

1) గురుబోధ పరమాత్మ తెలిపేనయా
గురుచేరి శరణనుము ఓ జీవుడా.... ఓజీవుడా ॥గురుబోధ॥

2) అధర్మంబు నిండెను నీలోనురా
ధర్మంబు తెలిసి నడువుమురా..నడువుమురా ॥గురుబోధ॥

3) గీతలోని బోధలన్ని తెలియుమురా
ఆ గీతలోని వ్రాతగ నడువుమురా..నడువుమురా ॥గురుబోధ॥

4) జ్ఞానూల దూషించే నీచులుగా
కర్మాలు మోసేరు మూర్ఖులుగా...మూర్ఖులుగా ॥గురుబోధ॥

5) గురుపూజ చేయంగ బాధపడుదురె
మూర్ఖులు తెలియరు గురుదేవుని....గురుదేవుని.. ॥గురుబోధ॥

6) కలికాల మాయలో పడిపోదురా
కనులైన తెరవక మసలుదురా...మసలుదురా ॥గురుబోధ॥

7) ప్రబోధ గురుని చేకొనరా
అసలైన బోధలు తెలియుమురా...తెలియుమురా ॥గురుబోధ॥



గమనిక:- ఈ సినిమా పాటలన్నీ ఇంటర్నెట్లో లభిస్తాయి. ఆ పాటల లయను అనుసరించి మీరు పాడుకోవచ్చును.