పుట:Geetham Geetha Total.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1) కొబ్బరికాయలు కొడుతూయుంటే
పూజలు మెండుగ చేయుచుయుంటే
కలి మాయలలో చేసే పూజే
శాశ్వితమనుకొని తలచుచుయుంటే
చేయుచున్న ఆ పూజ - ఎంతో అర్థము ఉంటుందోయి ॥గణగణ॥

2) హారతి పొగలు ఎగురుచుయుంటే
మింటిలో కలిసి పోవుచుయుంటే
నేనూ నీవలె అయిపోయెదనని
చేతితో శపథము చేయుచుయుంటే
చేయుచున్న ఆ పూజ ఎంతో అర్థము ఉంటుందోయి ॥గణగణ॥



చిత్రము : సతీ అనసూయ (1971 )
పాట : ఆలయమేలా అర్చనలేలా
""""""""""""""""""""""""""""""""""""""""""""""
ఆలయమేలా - అర్చనలేలా - ఆరాధనలేలా
గురుదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా
అదే మన పెన్నిధి కాదా - అదే పరమార్థము కాదా

1) ఏ కొండ కొమ్మలోనో - ఏ రాతి బొమ్మలోనో
దైవమ్ము దాగేనంచు తపియించనేల
ఆ దైవము తనలోయుంటే, అడుగడుగున తానేెయుంటే
గుడులేల - యాత్రలేల ॥ఆలయమేలా॥

2) పైపైన కోర్కెల కోసం - భ్రమచెందు గ్రుడ్డిలోకం
హృదిలోన వెలిగే గురుని గమనించునా