పుట:Geetham Geetha Total.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1) మహిలో ధర్మము - మనుపగనెంచి - మా ప్రభువైనావో
మమతలు తెలిసి - మనుషుల మలచి - మనుజుల బ్రోచేవో
వెలిసే నీలీలా..... తెలిసే దేవేలా........... ॥తెలిసింది॥

2) అండము పిండము - ఈ బ్రహ్మాండము - నిండెను నీ మహిమా
పావన నీ నామము - మరువక చేసెద మదిలో నీ భజనా
కానవా దేవా - కరుణాల వాలా ॥తెలిసింది॥

3) సతతము నిన్ను - స్మరియింతుమయా - ఆత్మలో అను దినమూ
మా మనసున నిలిపి - మాయలు బాపీ - మము చేరదీసేవో
జగమే నీవంతా - శక్తివైనావు ॥తెలిసింది॥

4) కొండలలోనా - కోనలలోనా - ఉండెను నీ ఆత్మా
ఆత్మానంద - యోగము పొంద - మార్గము చూపవయా
సరియైన త్రోవ - చూపించరావా ॥తెలిసింది॥



చిత్రము : ఆత్మ బలము (1964)
పాట : చిటపట చినుకులు
""""""""""""""""""""""""""""""""""""""""""""""
గణగణ - గంటలు - మ్రోగుచుయుంటే
కోవెల సరసన - భక్తులుయుంటే
పండూ ఫలము చేతిలో పట్టి
మ్రొక్కుబడులకై పోవుచుయుంటే
చేయుచున్న ఆ పూజ - ఎంతో అర్థము ఉంటుందోయి