పుట:Geetham Geetha Total.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1) నీ ఆశ్రమమే - శాంతికి నిలయము
నిను సేవించుటే - బ్రతుకే ధన్యము
నీవు మావాడవై - మేము నీవారమై
మమ్ము లాలించి - పాలించరా స్వామి ॥చూచే ఆత్మ॥

2) తల్లివి నీవే - తండ్రివి నీవే
ఎన్నడు తరుగని - పెన్నిధి నీవే
నిన్ను నమ్మినాము - మమ్ము దరిచేర్చవా
స్వామి నీ శిష్యులను - బ్రోవవా స్వామి ॥చూచే ఆత్మ॥

3) ఎన్నో జన్మల - పుణ్యము మాది
నిను సేవించుట - కబ్బెను మాకు
మేము నీ గానమే - మేము నీ ధ్యానమే
నీవు లేకున్న - ఈ లోకమే శూన్యము ॥చూచే ఆత్మ॥

4) వేడుకలోనా - వేదనలోనా
మరువము స్వామీ - నీ పదసేవా
నీవు మాదేవుడే - మేము మీ భక్తులె
మముకరుణించి - కాపాడవా స్వామి ॥చూచే ఆత్మ॥



చిత్రము : బుల్లెమ్మ బుల్లోడు (1972)
పాట : కురిసింది వాన - నా గుండెలోనా
""""""""""""""""""""""""""""""""""""""""""""""
తెలిసింది జ్ఞానం - నా స్మృతిలోన - నీ చూపులే చల్లనా
మధురం నీ జ్ఞానం - మధురం నీ యోగం