పుట:Geetham Geetha Total.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4) నిదురతోనే, నిండిన మేము
కంటిమి నిన్నే, కన్నుల విందుగ
జ్ఞానమెకల్గి, అహమే పోయి
బ్రతుకే మాకు యతిగా సాగే ॥సద్గురు॥



చిత్రము: బందిపోటు (1963)
పాట  : వగలరాణివి నీవే
""""""""""""""""""""""""""""""""""""""""""""""
కర్మ జీవివి నీవే - దైవ ఆత్మను నేనే
కర్మకాలెను - ఆత్మ దొరికెను - ముక్తి వచ్చెనులె

1) ఆత్మ జ్ఞానము నీ కోసం..... కర్మ తెరలు నా కోసం
రెండు కలసిన - నిండు మోక్షము - మనకోసం ॥కర్మజీవి॥

2) కోప గుణము కలవాడా - జ్ఞాన చూపు లేనివాడా
యోగమార్గము - జ్ఞాన ఖడ్గము - స్వంతమే కాదా ॥కర్మజీవి॥

3) జ్ఞానమంతా పైపైనే - యోగమంతా నా పైనే
ఆత్మ సన్నిధి - ఒదిగినంతనె - మారిపోదువులె ॥కర్మజీవి॥



చిత్రము : గీత (1973)
పాట : పూచే పూలలోనా - వీచే గాలిలోనా
""""""""""""""""""""""""""""""""""""""""""""""
చూచే ఆత్మలోనా - చేసే ఆత్మ నీవే
నీ జ్ఞానమే మ్రోగెలే - నీ యోగమే సాగెలే
ఓ గురూ........ ఓ ..........గురూ