పుట:Geetham Geetha Total.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2) ఎప్పుడు నీవేమాతో యుంటే.....
ఎన్ని యుగాలైతే నేమి.......
కన్నుల నీవే కనబడుచుంటే........
ఎన్ని జన్మలు వస్తేనేమి.......
అందనీ మోక్షములో.......అంతటా యుండెదమూ
తెలియనీ దేవునిలో..... తెలిసీయుండేము ॥సిద్ధాంత॥



చిత్రము : నిర్దోషి (1967)
పాట : మల్లియలారా, మాలికలారా
""""""""""""""""""""""""""""""""""""""""""""""
సద్గురు దేవా..... మా పాలి స్వామి........
యోగములోయున్నారా......... మా విధినే చూచారా.....

1) మనసులోనే, బాధలు రేగె...
చిత్తములోనే, చింతలు మూగే
జ్ఞానమూ లేక, కర్మముపోక
బ్రతుకే మాకు, బరువైసాగే ॥సద్గురుదేవా॥

2) రేగిన మనసు, నిలుపుటకొరకు
చేరితిమయ్యా, నీదరిలోన
ఆత్మానందా, కావగరావ
నీవే మాకు గురువైరావ ॥సద్గురు॥

3) ఆశ్రమమంతయు, భక్తులు నిండ
కోరిన బోధా, చెప్పితివయ్యా
హృదయము పొంగ, కర్మము కృంగ
బ్రతుకే నీలో, రథమై సాగే ॥సద్గురు॥