పుట:Geetham Geetha Total.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ భగవంతుడిట్లనియె :-

05. ఆ. శతసహస్రరూప వితతి యౌనాస్వరూ
పంబుఁ జూపువాఁడఁ బార్థ ! కనుమ;
దివ్యకాంతియుతము దేదీప్యమానంబు
నకలవర్ణజాల సంయుతంబు

06. తే. వసువు లెనమండ్ర ద్వాదశ భాస్కరులను
పదునొకండు రుద్రుల నశ్వి వైద్యవరుల
నలువదియును దొమ్మిదిమరుత్తులను మఱియు
ముందు చూడనియాశ్చర్యములను గనుము.

07. తే. సర్వజగతియందులి చరాచరసమూహ
ముల ననేకంబు నేకస్థములుగ నాదు
దేహమం దున్నవానిఁగాఁ దెలియగలవు;
కనుము సంపూర్ణముగ నీకుఁ దనివి దీర.

08. తే. అనఘ ! నాయీశ్వరత్వంబు గనుఁగొనంగ
బ్రాకృతము లగునీకనుల్‌ పనికిరావు;
కనుక నీకిత్తు నాయను గ్రహమువలన
దివ్యదృష్టిని, దానిచేఁ దెలిసికొనుము.

అర్జునుడిట్లనియె :-

15. తే. దేవదేవ! చూచితిని నీ దేహమందు
సర్వదేవతలను భూత సంఘములను,
నలువదేవునిఁ గమలాసనస్ధు, రుద్రు,
సర్వఋషివర్యులను, దివ్యసర్పములను.