పుట:Geetham Geetha Total.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రము: ఇద్దరు మిత్రులు (1961)
పాట  : ఖుషీ ఖుషీగా నవ్వుతూ
"""""""""""""""""""""""""""""""""""
దయామయా నీ జ్ఞానమే, తలంచు వారికి కర్మలే
భష్మమవుగా వెంటనే, యోగి ప్రబోధానందా

1) జ్ఞానముతోనే, మదిలోదల్చి, యోగదీక్షనే పూని
ఆరు చక్రముల, దాటివత్తురే, నీదురూపమే చూడ ॥దయా॥

2) పేదా ధనికా, భేదమెందునా, లేదు ఆత్మకు సత్యము
ఆత్మలోనె, మైమర్చియుండిన, బ్రతుకు వారిదే ధన్యము ॥దయా॥

3) కష్టాలన్నీ, జ్ఞానశక్తితో, చక్కచేతువేస్వామి
ఒక్కసారి, నీ బోధవిన్ననూ, ధన్యమేకదా స్వామి ॥దయా॥

4) గ్రంథములెన్నో వ్రాసినావుగా, జ్ఞానశక్తితో స్వామి
నీదుసాటి ఏ గురువునెరుగము ధరణిలోనే మా భాగ్యము ॥దయా॥



చిత్రము: మంగమ్మ శపథం (1965)
పాట : కనులీవేళ చిలిపిగనవ్వెను.
"""""""""""""""""""""""""""""""""""
గురు ప్రబోధ, దయగను, మంటిమి
నిను మనసార కొలిచెద మంటిమి
గురు రాజ సజ్జనపోష నీవంటిమి
గురు రాజ సజ్జనపోష నీవంటిమి