పుట:Geetham Geetha Total.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రము: పూజాఫలం (1964)
పాట  : పగలే వెన్నెల - జగమే ఊయల
"""""""""""""""""""""""""""""""""""""""
అహమూ మానరా....... ఇహమూ మాయరా
పరమే శాశ్వతమని మరువబోకురా....ఆ......ఆ......ఆ....

1) ఆత్మలోన, అంధకారం, అలముకొనేరా
జ్ఞానజ్యోతి, వెలుగజేసి, ప్రారద్రోలరా
ఆత్మకు, నాశమూ, లేనేలేదురా
ఆత్మయే, పరమాత్మ, రూపమౌనురా ॥అహము॥

2) నిత్యమైన, ముక్తిమార్గ, మరయవేల
సత్యమైన, సూక్తులను, నమ్మవేల
గురువుకు, జ్ఞానము, రానేరాదురా
గురువే, పరమాత్మ, జ్ఞానమౌనురా ॥అహము॥

3) కామక్రోధ, లోభమోహ, మధమత్సరం
ఆర్గురూ, శత్రులనే, అర్థమెరుగరా
జ్ఞానమె వాటినీ అణచెడుశక్తిరా
రయమున జ్ఞానమార్గ మరయరారా ॥అహము॥

4) విశ్వరూప పరమాత్మ ముక్తిదాయక
జ్ఞానదీక్ష నొసగిమమ్ము ఆదరించవా
యోగీ శుభకరా జ్ఞానము నీయరా
రయమున యోగదారి చూపరారా ॥అహము॥