పుట:Geetham Geetha Total.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేడియో పాట, ప్రైవేట్‌ సాంగ్‌
పాట : బిందంటే బిందెకాదురా, ఓపాపోడ బిందె ఖరీదు చెప్పరా
""""""""""""""""""""""""""""""""""""""""""""""
ఆత్మంటే వేరులేదురా... ఓ జీవుడా ఆత్మాజ్ఞానము తెలియర
అందు నిందు సందులేదు, అంతటా నిండియుంది
నీవు చేసిన కర్మలకు, తెలియకుండ పోయినాది

1) గురువంటే మనిషి కాదురా... ఓ జీవుడా గురువంటే దేవుడేనురా
జ్ఞానాము చెప్పువాడు, కర్మాలు బాపువాడు,
నీకున్న గుణములకు, తెలియకుండా పోయినాడు. ॥ఆత్మంటే॥

2) కర్మంటే ఏమోకాదురా........ ఓ జీవుడా నీవు చేసే పనులేనురా
నీవు చేసే పనులకు, పాపపుణ్యములొచ్చినాయి
నీకున్న మూర్ఖతకు తెలియకుండ పోయినాయి. ॥ఆత్మంటే॥

3) మనసంటే వేరేలేదురా........ ఓ జీవుడా నీలోని జ్ఞప్తియేనురా
ఆలోచన చేయునాది, అంతటా పోవునాది
గాలికంటే వేగమైనాది, చెప్పకుండా పోవునాది ॥ఆత్మంటే॥

4) అహమంటే ఏమోకాదురా...... ఓ జీవుడా నేనను భావమేనురా
అహమాను భావముండె, కర్మాలు తెచ్చిపెట్టె
దానీని తెలియవోయి, ఓ మూఢ జీవుడా ॥ఆత్మంటే॥

5) స్వామి అంటే ఎవరోకాదురా..... ఓ జీవుడా జ్ఞానాము చెప్పువాడురా
వేసాలు వేయనోడు, గడ్డాలు పెంచనోడు
పూసాలు కట్టనోడు ప్రబోధ గురవేను ॥ఆత్మంటే॥