పుట:Geetha parichayam Total Book.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురాణములకు ఇచ్చుటవలనను అన్నిటిలో గీత కూడ ఒకటైపోయినది. భగవద్గీతకు హిందూ మతములో ప్రత్యేక స్థానము లేక పోవడమువలన, హిందూమతమునకు పైన ఆధారము, క్రింద పునాది తెలియకుండ పోవుటవలన హిందూమతము క్షీణించు అవకాశమేర్పడినది.

భగవద్గీత సర్వమానవులకు, అన్ని మతములలోని వారికి తెల్పిన హద్దని, మానవాళికి, మాయకు మధ్యలో గీచిన గీతయని, ఒక్క హిందూ మతములోని వారికేకాదని, అన్ని మతములలోని ఇందువులకని (జ్ఞానులకని) తెలియునట్లు వ్రాయబడినదే త్రైత సిద్ధాంత భగవద్గీత! అందరికి సంబంధించిన భగవద్గీతంటే ఏమిటో తెలియాలంటే ముందు ఈ "గీతా పరిచయము" చదవవలసిందే!! గీతా పరిచయము మొదట చదువుటవలన అన్ని మతముల వారికి గీత యొక్క స్వరూపమేమిటో తెలియగలదు. గీతా పరిచయములో అనేక సంశయములు, అనేక ప్రశ్నలు సృష్ఠించబడి, భగవద్గీతలో వాటికి సమాధానములు తెలుపబడినవి. అందువలన చూపు గీతాపరిచయము కాగ, దృశ్యము భగవద్గీత అయినది. ఒక విషయము తెలియుటకు మొదట, తెలియువాడు, తర్వాత తెలియబడునది రెండు అవసరమున్నట్లు గీత యొక్క విషయము తెలియుటకు, మొదట గీతాపరిచయము తర్వాత త్రైతసిద్ధాంత భగవద్గీత అవసరము. ఈ రెండు తెలిస్తే భూమి మీద మతములంటే ఏమిటో, మనుషులంటే ఏమిటో తెలియగలదు. తర్వాత అన్నిటికి మూలపురుషుడైన దేవుడు తెలియగలడు.

-***-