పుట:Geetha parichayam Total Book.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోధించునట్లు చేయుచున్నది. ఉదాహరణకు ఒక విషయమును చూస్తాము. ఒక సినిమా శతదినోత్సవ సభలో ఒక స్వామి ఉపన్యసిస్తు, డైరెక్టరు గొప్పపని చేశాడని చెప్పుచు, "ఈ సినిమా దర్శకుడు ఒక గొప్ప యోగియై ఎంతో తపస్సు చేసి చిత్రమును తయారు చేశాడు. ఈ సినిమాపట్ల ఆయన చేసిన తపస్సుకు మెచ్చుకోవలసిందే" అన్నారు. ఇక్కడ సినిమా దర్శకుడుపడిన శ్రమను తపస్సుగ పోల్చి చెప్పడమే కాక అతనినే యోగి అనడము కూడ జరిగినది. దీనిని బట్టి చూస్తే ఆయన ఉపన్యాసములో యోగి, తపస్వి ఇద్దరు ఒకరేనని తెలియుచున్నది. ఇది ఒక సంఘటనకాగా మరియొక విషయమును చూస్తాము. ఒక స్వామిని ఒక పట్టణమునకు అక్కడి ప్రజలు ఆహ్వానించారు. ముందుగానే ఆ విషయమును ప్రజలకు తెలియజేయుటకు, అందరిని స్వామిగారి దర్శనార్థమురమ్మని చెప్పుటకు ఒక ఆహ్వాన పత్రికను అచ్చువేయించి పంచిపెట్టారు. ఆ ఆహ్వానపత్రికను అచ్చువేసిన వారు ఆధ్యాత్మికవిద్యను బాగా తెలిసినవారే. వారు అచ్చు వేయించిన పత్రికలో సమాచారము ఈ విధముగ గలదు. "ద్వాదశ సంవత్సరములు రుద్ర భూమినందు తపమాచరించి యోగిగ మారిన శ్రీశ్రీశ్రీ బాలభారతి యోగి గారు మన పట్టణమునకు విచ్చేయుచున్నారు. భక్తులందరు విచ్చేసి దర్శనము చేసుకోవలసిందని కోరుచున్నాము" అని వ్రాశారు. ఇక్కడ కూడ పండ్రెండు సంవత్సరములు స్మశానములో తపస్సు చేసిన తపస్విని యోగి అన్నారు. "తపము చేసి యోగిగ మారిన" అన్నారు. ఈ విషయమును వ్రాసిన వారు గొప్ప తత్త్వవేత్తలే అయినప్పటికి తపస్సుకు యోగమునకు భేదము తెలియలేక పోయారు. తపము చేసిన వానిని యోగిగ, యోగము చేసిన వానిని తపస్విగ చెప్పుకొనుట వలన భగవద్గీతలో దేవుడు చెప్పిన ధర్మములకే ముప్పు ఏర్పడగలదు. ధర్మములకు గ్లాని ఏర్పడినదని ధర్మములను కాపాడుట కొరకు దేవుడే దిగివచ్చి "తపస్విభ్యోధికో యోగి" అని చెప్పినప్పటికి, యోగమునకున్న గొప్పతనమును తెలియక తపస్వికులను, యోగులను ఒకటే అనుకోవడము పొరపాటు కాదా! దేవుడు చెప్పిన