పుట:Geetha parichayam Total Book.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆనాటి ప్రజలలో భక్తియనునది ఉన్నప్పటికి అది బాహ్య దేవతారాధనల మీద ఉండెడిది. అంతర్ముఖ ఆధ్యాత్మికము మీద ఏమాత్రము లేకుండెడిది. ఎందరో ఋషులున్నను వారంతయు దేవతల మీద దృష్ఠినుంచి తామేదో పొందవలెనను తపన తప్ప, యోగమేమిటో తెలియకుండిరి. ఎంతటి గొప్ప ఋషులైన పుణ్యమొచ్చు సత్కార్యములు తప్ప, పుణ్యమంటని కార్యవిధానము తెలియకుండిరి. నీతి తప్ప జ్ఞానము తెలియని ఆ కాలములో, న్యాయము తప్ప, ధర్మము తెలియని అటువంటి సమయములో భగవంతుడు ఉద్భవించాడు. ఆ భగవంతుడు చెప్పినదే భగవద్గీత. గీత భగవంతుని ద్వార బోధింపబడినది. భగవంతుడు గీతను శాశ్వతముగ వుండునట్లు గీచిపోయినప్పటికి ఆ హద్దులోని ఆధ్మాత్మిక రూపమును, అజ్ఞానమను గ్రుడ్డితనముతో మానవుడు సరిగ చూడలేక పోయాడు. ఇవి ధర్మములని గుర్తించలేక పోయాడు. ఇది ఆధ్యాత్మికమని బోధించుటకు మానవులైన కొందరు గురువులుగ బయలుదేరినప్పటికి, వారియందు మాయ తిష్ఠవేసి ఆధ్యాత్మికమునే బోధించునట్లు భ్రమింపజేసి, వారిచేత అధర్మములనే బోధింపచేసింది. పరమాత్మ చేత సృష్ఠింపబడిన మాయ, పరమాత్మకు వ్యతిరిక్తముగ బోధించునట్లు మరియు వర్తించునట్లు చేయుట దాని కర్తవ్యము. కావున మానవుల శరీరములలో గుణములందు ఇమిడియుండి, ఎవరు గుర్తించలేనట్లున్న మాయ మానవులను సులభముగ తనవైపు నడిపించు కొనుచున్నది. ఎందరో గురువులను సహితము భ్రమింపజేసి, పరమాత్మ యొక్క విధానమును గాని, పరమాత్మ ధర్మములను గాని, గుర్తించకుండునట్లు చేసి, వారు చేయుచున్నది మరియు వారు చెప్పుచున్నది పరమాత్మ జ్ఞానమేనన్నట్లు తలపింప జేయుచున్నది. అందువలన ఎందరో మహానుభావులు కూడ ఆధ్యాత్మికములో పరమాత్మ చెప్పినట్లు కాక, కొద్దిగ ప్రక్క మార్గములో పోయారనియే చెప్పవచ్చును.

తెలిసినవారు కూడ ముఖ్యమైన ధర్మములవద్ద పొరబడునట్లు మాయ చేసినది. ప్రజలకు జ్ఞానమును బోధించు బోధకుల చేతనే ప్రక్కదారిని