పుట:Geetha parichayam Total Book.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చిన తర్వాత కొంతసేపటికి అనగ ఐదు నిమిషములకో, పది నిమిషములకో, అరగంటకో, లేక గంటకో ఎక్కడో శరీరమును వదలిన మనము శిశు శరీరములో చేరి అరచుచున్నాము. ఒకచోట మరణించిన జీవుడు గుణములు, పాపపుణ్యములతో కూడివచ్చి నిర్ణయింపబడి సిద్ధముగ బయటికి వచ్చియున్న క్రొత్త శరీరములో ప్రవేశిస్తున్నాడు. సర్వవ్యాపియైన పరమాత్మ మనమాదిరి ఒకచోట మరణించి మరియొక చోటికి పోనవసరము లేదు. ఆయన శరీరము ధరించి మాట్లాడి ధర్మములు తెలియజేయాలనుకొన్నపుడు స్త్రీ శరీరములోను, గర్భమందు, గర్భస్థ శిశువునందు, సర్వము వ్యాపించి ఉన్నాడు కనుక శిశుశరీరముతో సజీవముగ పుట్టుచున్నాడు. అందువలన ఆయన ఒక్కడే భగవంతుడగును. సర్వవ్యాపి, సర్వము తానైనవాడు మరియొక దాని ప్రమేయము లేకుండ పుట్టగలడు. "స్వయంభు" అయిన పరమాత్మ పుట్టవలసి వచ్చినపుడు శిశుశరీరము తయారగుటకు పురుష వీర్యకణములతో కూడ పనిలేదు. కనుక సర్వవ్యాపియైన వాడు కన్యగర్భము నుండియైన పుట్టిరాగలడు. ఖుద్‌ అనగా తనకు తానుగ పుట్టువాడు ఖుదా అగును. ఖుదాయైన పరమాత్మ సజీవముగ పుట్టిన శరీరమునకు శ్రీకృష్ణ అను పేరు పెట్టారు. కావున శ్రీకృష్ణుడు భగవంతుడు, ఆయన చెప్పినదే భగవద్గీత.

ధర్మములంటే ఏమిటో తెలియకుండపోయి,అధర్మములు మానవులందు ఎక్కువైనప్పుడు ఉద్భవించి, ధర్మముల గూర్చి తెలియజేస్తానని గీతయందు భగవంతుడు తెల్పాడు. ఆ మాట ప్రకారము ద్వాపరయుగ అంత్యములో భగవంతుడు పుట్టాడంటే అపుడు ధర్మములకు ముప్పు ఏర్పడి అధర్మములు చెలరేగి ఉన్నవన్నమాట. ఇక్కడ కొందరికి ఒక అనుమానము రావచ్చును. ద్వాపరయుగ అంత్యములో వ్యాసుడు, భీష్ముడు, మొదలైన ఎందరో గొప్ప వారుండెడి వారు గదా! ఆ సమయములోనే ధర్మములకు ముప్పు ఏర్పడినదా? అన్నది ప్రశ్న. దానికి జవాబు ఏమనగా! ఆనాడు తపస్సులు, యజ్ఞయాగాదులు, వ్రతక్రతువులు ఎక్కువగ ఉండెడివి. వాస్తవిక ధర్మములు తెలియని కారణమున