పుట:Geetha parichayam Total Book.pdf/60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ధర్మమునకు వ్యతిరేఖముగ చెప్పినవారము కాదా! దేవుని ధర్మమునకు ముప్పు కల్గించినవారమై, దేవుని మాటకు విలువ లేకుండ చేసిన వారమగుదుము కదా!

ఎంతో చిన్న జ్ఞానమును కూడ గ్రహించలేక, ఎంతో పెద్ద స్వాములు కూడ పొరబడడము విచిత్రముగ నున్నది కదా! ఇప్పటికి కూడ నూటికి తొంభైమందికి తపస్సు వేరు, యోగమువేరని తెలియక పోవడము విచిత్రముగానే ఉన్నది. చాలా పురాణములలో తపస్సును, యోగమును రెండిటిని ఒకటిగానే చెప్పుకొన్నారు. ఒక మహర్షి అడవిలో కూర్చొని తపస్సు చేయుచుండగ అతని యోగదీక్షకుమెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడని ఒక పుస్తకములో వ్రాసియున్నది. అలాగే ఒక రాజు యోగము చేయుచుండగ అతని తపస్సుకుమెచ్చి బ్రహ్మదేవుడే ప్రత్యక్షమయ్యాడని మరొక పుస్తములో వ్రాశారు. ఈ వ్రాతలుగాని, కొందరి బోధలుగాని భగవద్గీతలోని ఆత్మసంయమ యోగము 46వ శ్లోకములో "తపస్వి భ్యోధికో యోగీ" అను మాటకు వ్యతిరిక్త ధోరణిలో గలవు. మాయ జ్ఞానులను కూడ దేవుని మాటకు వ్యతిరేకులుగ చేయగలదు. అందువలన శాస్త్రమును ఆధారము చేసుకొని జ్ఞానమార్గములోనే నడువవలెను. అట్లు కాకపోతే దారి తప్పు ప్రమాదము గలదు.

నేటి కాలములో ఎందరో గురువులుగ పేరుగాంచినవారున్నారు. వారిలో స్వచ్ఛమైన జ్ఞాన వివరములుకాక పురాణ ఇతిహాసములైన భారత భాగవత, రామాయణ కథలను చెప్పుకొను గురువులను వదిలివేసి, ఆత్మ వివరమును తెలుపునట్టి జగత్‌ గురువులను సహితము చూచిన ఎడల వారియందు కూడ కొంత మాయ పనిచేసినదనియే చెప్పవచ్చును. ఉదాహరణకు అద్వైత సిద్ధాంతమును ప్రచారము చేసినవారున్నారు. మరియు ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేసిన వారు కూడ ఉన్నారు. పీఠాధిపతులై గొప్ప గురువులమని పేరుగాంచిన వారే ఒకరి సిద్ధాంతమును మరొకరు ఒప్పుకోక ద్వైతము సరియైనదికాదని అద్వైతులు, అద్వైతము సరియైనదికాదని