పుట:Geetha parichayam Total Book.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మము గలదు. అట్లే బ్రహ్మవిద్యను తెలుపు యోగశాస్త్రము ప్రకారము దైవమునకు కూడ ధర్మము గలదు. దైవధర్మమును ఆచరించినపుడు మానవుడు కూడ దైవముగ మారిపోవును. మానవుడు పరమాత్మ నుండి బయటికి వచ్చిన జీవాత్మ. జీవాత్మ తన పూర్వపు ధర్మమైన పరమాత్మ ధర్మమును అనగ తన స్వధర్మమును ఆచరించిన ఎడల మరల పరమాత్మ స్థాయిలో చేరిపోగలడు. గాలి నీరు వేరు వేరైనప్పటికి గాలినుండే నీరు పుట్టినది. కావున నీరు తిరిగి గాలిగ మారిపోగలదు. నీరు గాలిగ మారుటకు ప్రయోగమవసరము. అట్లే జీవాత్మ పరమాత్మగ మారుటకు యోగమవసరము. ఏ ప్రయోగము ద్వార నీరు గాలిగ మారునో ఆ విధానమును శాస్త్రవేత్తలు తెల్పినట్లు, ఏ యోగము ద్వారా జీవాత్మ పరమాత్మగా మారగలదో ఆ విధానమును భగవంతుడైన శ్రీకృష్ణుడు తెల్పాడు. ప్రయోగములో ఏ పద్ధతులు అనుసరించాలో శాస్త్రవేత్తలు తెల్పినట్లు యోగములో ఏ పద్ధతులు అనుసరించాలో శ్రీకృష్ణుడు తెల్పాడు. ఆ పద్ధతులే గీతలో గలవు. నీరు గాలిగ మారుట శాస్త్రబద్దమైన విషయము. అట్లే జీవాత్మ పరమాత్మగ మారుట కూడ శాస్త్రబద్దమైన విషయము.

కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన యుద్ధములో శ్రీకృష్ణుడు రథసారథ్యము వహించాడు. యుద్ధప్రారంభములో అర్జునుడు మోహగుణము చేత అక్కడున్న వారందరు తనవారని, వారిని చంపుట చేత పాపము కూడ వచ్చునని, చింతించి నిశ్చేష్ఠుడు కాగ అపుడు శ్రీకృష్ణుడు మాట్లాడుచు యుద్ధము చేయకపోతే మొదట, వారు నిన్ను పౌరుషము లేనివానిగా లెక్కింతురని, యుద్ధము చేసి వీరుడవనిపించుకోమని, ప్రపంచ సంబంధ వచనములే చెప్పగ అర్జునుడు యుద్ధము చేయుటకు ఉత్సాహములేదని, ఏమి తోచని స్థితిలో ఉన్నానని, నన్ను శిష్యునిగ తలచి నీవు శాసించి ఏమి చేయాలో చెప్పమని అడిగినపుడు శ్రీకృష్ణుడు తన గీతను మొదలు పెట్టిచెప్పాడు. ఏ వస్తువైన అవసరమైనపుడు లభిస్తే దానికి విలువ ఉంటుంది. అవసరములేనపుడు ఆ వస్తువును అంతగ లెక్కించము. అలాగే అర్జునునికి అవసరమైనపుడు గీతను