పుట:Geetha parichayam Total Book.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పుటవలన దానికి విలువ ఉంటుంది. అలా అవసరము లేనపుడు చెప్పితే గుడాకేశుడు (నిద్రను జయించినవాడు) అని పేరుగాంచిన అర్జునుడు కూడ ఆవులించి నిద్రపోగలడని తలచిన శ్రీకృష్ణుడు తన జ్ఞానమును అర్జునుడు అడుగు వరకు చెప్పలేదు. అలాగే ఈనాటి మానవుడు కూడ తనకు జ్ఞానము అవసరమని తెలియనంత వరకు గీతను గూర్చి చెప్పిన తెలియలేడు. ఎప్పుడో ఒకప్పుడు అర్జునునికి కల్గిన అనుభూతివలే మనకు పాపభీతి ఏర్పడినపుడు అర్జునునికి అవసరమైన గీతయే మనకు కూడ అవసరమగును. పాపభీతి ఇప్పటి మానవునికి ఎక్కడ కనిపించడము లేదు. అందువలన శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడన్నది వీరికి అవసరములేకున్నది. నేటి మానవునికి కష్టభీతి తప్ప పాపభీతిలేదు. కష్టము లెలా పోతాయను ఆలోచన తప్ప, కష్టములకు కారణమైన పాపమెలా పోతుందని యోచించడము లేదు. కష్టములకు కారణమైన పాపమును గూర్చి యోచించిక కేవలము కష్టనివారణ ఉపాయములే వెదుకుచున్నాడు. అలాంటి సమయములో దారి చూపి ఇది మీకష్టములకు కారణమని తెలియజేయాల్సిన వారు గురువులు. నేటి కాలములో గురువులు కూడ జ్ఞానమను అగ్ని చేత పాపకర్మలు కాలిపోవునని. అపుడు కష్టముల నుండి బయటపడగలరని చెప్పక, కష్టనివారణకు ఈ ప్రదక్షిణలు చేయమనో, ఈ యజ్ఞములు చేయమనో, దానములు చేయమనో లేక పూజలు చేయమనో చెప్పుచున్నారు. దాని వలన తాత్కాలిక కష్టనివారణ కోసమే మానవుడు మ్రొక్కడమో లేక యజ్ఞయాగాది దానములు చేయడమో జరుగుచున్నది. అలాంటపుడు గీత యొక్క ఆవశ్యకత ఎంతటిదని తెలియకపోయినది. ఒకవేళ ఎక్కడైన గీతను చదవడముంటే అది కూడ పలానా లాభమువచ్చునను ఉద్ధేశ్యముతోనే చదువుచున్నారు తప్ప దీనివలన జ్ఞానమెంతో తెలియునని, జ్ఞానము వలన కర్మ నుండి బయటపడి ముక్తి పొందవచ్చునను ఉద్ధేశ్యముతో చదవడము లేదు. ఒకరకముగ చెప్పాలంటే గీత కొన్ని గ్రామములలో ఎక్కువగ ప్రచారములోనికి వచ్చినది. గీతామందిరములు కట్టించుకొని అక్కడ గీతను