పుట:Geetha parichayam Total Book.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎన్నో పుణ్యములు చేయుచున్న మానవుడు వాటిని ధార్మిక కార్యములు చేస్తున్నట్లు చెప్పుచున్నాడంటే ధర్మమనునది ప్రత్యేకమైనదని తెలియక పోవడమే కారణము. అంతేకాక నీతి కార్యమైన దానము చేయు ప్రతి సందర్భములోను ధర్మము చేయుచున్నాననడము కూడ గ్రహించవచ్చును. ఒక దేవాలయములో ఫ్యానును బిగించి ఒకడు దానము చేశాడనుకొందాము. అక్కడ ఫ్యాను విూద పలానా వారి ధర్మమని దానము చేసిన వారి పేరును వ్రాసియుందురు. పలానా వారి దానమని మాత్రమువుండదు. అతను చేసినది దానమేయైనప్పటికి ధర్మమని వ్రాయుటలో అర్థమే లేదు. ఇట్లు తెలియని తనము అందరిలో వ్యాపించి చివరకు భిక్షమడుగువాడు కూడ దానము చేయండి అనక ధర్మము చేయండి అనడము చూస్తూనే ఉన్నాము. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ధనికులను మొదలుకొని భిక్షగాని వరకు ధర్మమంటే ఏమిటో తెలియక పోయినదని అర్థమగుచున్నది. స్వాములు సహితము పుణ్యము వచ్చు మెత్తని నీతి మాటలే చెప్పుచున్నారంటే ధర్మమునకు భూమి మీద గుర్తింపులేదని అర్థమగుచున్నది.

ఇలా ధర్మాధర్మముల వివరము ప్రకారము చూస్తే కురుక్షేత్రము ధర్మక్షేత్రమేమాత్రము కాదు. అవినీతి అన్యాయములకు ఆలవాలమైన మనుజుల మధ్య జరిగిన పోరాట స్థలమును ధర్మక్షేత్రమనడము సమంజసము కాదు. ఆనాడు కౌరవ పాండవులు నీతిని ఉల్లంఘించి, సంగ్రామమున యుద్ధపు కట్టుబాట్లను అతిక్రమించి, మోసముతో ఒకరినొకరు చంపుకొని రక్తసిక్తమై చరిత్రకెక్కిన స్థలము ధర్మక్షేత్రమా? అలా అది ధర్మక్షేత్రమైతే, పౌరుషమే ఊపిరిగ ముఠాకక్షలతో పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రములోని రాయలసీమ జిల్లాలు కూడ ధర్మక్షేత్రములే అగును.

ఆచరణ యోగ్యమైనది ధర్మము, అది కదలిక కల్గిన మానవులు మాత్రమే ఆచరించుటకు ఉపయోగపడును. అందువలన ధర్మపరుడు అధర్మపరుడని మనుషులను పిలువవచ్చును. కాని చైతన్యములేని భూమికి ధర్మక్షేత్రమని పేరుపెట్టడములో అర్థము లేదు. సైన్సు ప్రకారము ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క