పుట:Geetha parichayam Total Book.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పుటకు వీలులేదు. గీతను తెలుగులోనికి అనువదించి అర్థము చెప్పువారు సరైన విధముగ చెప్పలేక పోవడము వలన పై విధముగ అనుమానములు కొందరికి వచ్చి ఉండవచ్చును. సత్యము చెప్పాలంటే ఆనాడు భగవంతుడు తెల్పిన గీత నేటి వరకు అర్థము కాలేదనియే చెప్పవచ్చును. ఎందుకనగా భగవద్గీతను సక్రమముగ అర్థము చేసుకోవాలంటే ముఖ్యముగ నాలుగు సూత్రములను అనుసరించి చదువ వలసియుండును. వ్రాయువారు కూడ ఆ నాలుగు సూత్రముల ప్రకారమే వ్రాసి ఉండవలెను. అలా సూత్రబద్దముగకాక ఇష్టమొచ్చినట్లు వ్రాయువారికి, ఇష్టమొచ్చినట్లు చదువువారికి గీతలోని అంతరార్థము ఎప్పటికి అర్థము కాదు. ఇంతవరకు ఈ నాలుగు సూత్రములను ఎవరు అనుసరించలేదు. కావున గీత యొక్క స్వరూపము ఎవరికి అర్థముకాలేదనియే చెప్పవచ్చును. ఈ మాటకు కొందరికి కోపము కూడ వచ్చివుండవచ్చును. గీత మాకు తెలియదా అని మమ్ములను దూషించినా ఫరవాలేదు. ఇంతవరకు సంశయరహితమైన గీత లేదు! అందువలన సంశయరహితమైన గీత కావాలంటే ముఖ్యమైన నాలుగు సూత్రములు గీత మీద పెట్టి చదవాలి. ఆ నాల్గు సూత్రములేవియనగా!

1. చదువుచున్న శ్లోకము జీవాత్మకా, ఆత్మకా, పరమాత్మకా,

ప్రకృతికా? ఎవరిని గూర్చిచెప్పబడినది?

2. చదువుచున్న శ్లోకము బ్రహ్మయోగమునకా!లేక కర్మ

యోగమునకా దేనికి సంబంధించినది?

3. చదువుచున్న శ్లోకము సాకారమునకా, నిరాకారమునకా

ఎవరిని గూర్చి చెప్పినది?

4. చదువుచున్న శ్లోకము శాస్త్రబద్దమా! కాదా?

ఈ నాలుగు సూత్రములు గీత మీద ప్రయోగించి చూడకపోతే అది ఆకారప్రాయమేయగును గాని అర్థసహితము కాదు. ఈ నాల్గు సూత్రముల