పుట:Geetha parichayam Total Book.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకదానికొకటి పొంతన లేకుండ ఉన్నాయి. ఇది అర్జునునితో యుద్ధము చేయించుటకొరకు అతనిని ఉత్సాహ పరుచుటకు పల్కిన పల్కులేకాని, సిద్ధాంతపరముగ లెక్కించు విషయములు లేవనుచున్నారు. ఆ మాట విన్నమేము "భగవద్గీత ధర్మయుక్తమైనది, శాస్త్రబద్దమైనది. అటువంటి దానిని సిద్ధాంత పరముగ లేదనుట ఏమి మాట" అని అడుగగా! వారు వారికున్న అనుమానము లను ఇలా చెప్పుచున్నారు. "ఏమిటయ్య గీతలో ఉండేది? గ్రుడ్డిగ చదివేవారికైతే సరిపోతుంది. వివరణా దృష్ఠితో చదివే మాలాంటి వారికి సరిపోదు. ఒక చోట ఇంద్రియములకు తెలియనిది 'ఆత్మ' అంటారు, మరియొక చోట 'ఓం'అను అక్షరమే దేవుడంటారు, అక్కడ కనిపించని వినిపించని వాడు ఇక్కడ కనిపించి వినిపించే 'ఓం' ఎట్లయ్యాడు? ఒక చోట ప్రకృతియే అంతాచేస్తున్నది, నేను ఏమి చేయలేదు చూస్తున్నాను, కేవలము సాక్షిని మాత్రమేనని చెప్పి, మరియొక చోట అన్నీనేనే చేస్తున్నాను, బొమ్మలాట మాదిరి ఆడిస్తున్నాననడము ధర్మమా? సిద్ధాంతమా? ఒకచోట నాకందరు సమానమని, అందరికి నేను సముడనని చెప్పినవాడు, మరియొక చోట హెచ్చు తగ్గు కులములుగ పుట్టిస్తున్నాననడము దైవత్వమా? ఒకచోట గుణముల వలననే కార్యములు జరుగుచున్నవంటాడు మరియు గుణములను త్యజించమంటాడు. మరియొక చోట గుణములు త్యజించి పనులు మానుట తామసము అంటాడు. అలా పనులు మానకూడ దంటాడు. ఒక చోట కుక్కను, ఏనుగును, చండాలుని అందరిని సమానముగ చూడమంటాడు. మరియొక చోట వాడు శత్రువు వానిని చంపుము అంటాడు. ఒక చోట ఆత్మ చంపబడదంటాడు, మరియొక చోట అందరిని నాశనముచేయు కాలుడను నేనే అంటాడు. ఈ విధముగ గీతలో ఎన్నో దిక్కు తెలియని మాటలున్నాయి. అందువలన అర్థముతో పనిలేకుండ కంఠాపాఠముగ చదువు వారికి సరిపోతుంది గాని మాకు నచ్చదు పో" అంటున్నారు.

భావమేమిటని చూచేవారికి గీతలో కొన్ని సంశయములు వచ్చు మాట నిజమే. అంతమాత్రమున గీతను అశాస్త్రీయము, సిద్ధాంతముకాదని