పుట:Geetanjali (Telugu).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
88

గీతాంజలి.

రేల బూజలుగలుగుదీ ♦ పాలె లేక ;
నేర్పరులచేత జక్కగా ♦ దీర్పబడిన
వేనవేల్క్రొత్త బొమ్మలు ♦ వెలయగలవు;
వానివానికి గాలంబు ♦ వచ్చినపుడు
శూన్యపావన వాహినిన్ ♦ జొచ్చిపొవు.
బొత్తిగా బూన గనకుండ ♦ బొదలువాడు
కేవలముజీర్ణనదనంపు ♦ దేవు డొకడె.

89


అఱవకుము కేకవేయకు ♦ మనుచు నన్ను
గోరి యున్నాడు నాధుండు ♦ కూర్మితోడ
నింక గుసగుసమాత్రమె ♦ యొనగగలదు;
మనసులోమాట పాటలో ♦ గొనిపోవు;
బ్రభునినంతకు జనిరెల్ల ♦ వారునిపుడు
అమ్మువారును గొనువారు ♦ నచట గలరు
పనులమధ్యను దినమధ్య ♦ మునకు నాకు
సెల వకాలంబులోఫ్పల ♦ గలిగెనిపుడు
కాల మిది గాకయున్నను ♦ బూలునాకు
నిచుగావుత బూదోట ♦ నెలమితోడ;
మిట్టమధ్యాహ్న మిప్పుడు ♦ మధుకరములు
వీడిసొమరితనమును ♦ బాడుగాత !